
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో మహేష్ బర్త్ డేను ట్రెండింగ్ చేస్తున్నారు. మహేష్ నటిస్తున్న ‘సర్కారివారి పాట’ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ తో ఈరోజు మొత్తం ఊపు వచ్చేసింది.
మహేష్ కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతర భాషల్లో కూడా మహేష్ బాబుకు అభిమానులు ఉన్నారు. తమిళంలో, విదేశాల్లోనూ ఫ్యాన్స్ బర్త్ డేను సెలబ్రేట్ చేస్తున్నారు.ఇప్పటికే తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని మహేష్ బాబు పిలుపునిచ్చాడు.
ఇక మహేష్ కు సినీ, రాజకీయ తారలంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా మహేష్ బాబుకు విషెస్ తెలియజేశాడు. ట్విట్టర్ వేదికగా మహేష్ బాబుకు విషెస్ తెలిపాడు.
కేటీఆర్ ట్వీట్ చేస్తూ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు.. నాకు తెలిసిన నైసెస్ట్ సూపర్ స్టార్ .. మీరు ఎప్పటికీ యంగే.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి డియర్ బ్రదర్’ అంటూ కేటీఆర్ రాసుకొచ్చాడు.
‘భరత్ అనే నేను’ సినిమా ప్రమోషన్ లో భాగంగా మహేష్-కేటీఆర్ కలిసి ఇంటర్వ్యూలో పాలుపంచుకున్నారు. మహేష్ సినిమాలు తాను అన్నీ చూస్తానని.. చెప్పుకొచ్చారు.
Happy birthday to the nicest superstar I know & the forever young @urstrulyMahesh 🌟
Many returns of the day brother
— KTR (@KTRBRS) August 9, 2021