
NTR – Ram Charan : గత ఏడాది విడుదలైన #RRR చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో, అవార్డుల విషయం లో కూడా అలాంటి సెన్సేషన్ సృష్టించింది.అంతర్జాతీయ అవార్డులను ఎన్నో గెలుచుకున్న ఈ సినిమా, చివరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు ని కూడా గెలుచుకొని సరికొత్త చరిత్రకి శ్రీకారం చుట్టింది.అయితే ఈ అవార్డ్స్ మూవీ టీం మొత్తానికి మంచి పేరు తెచ్చి పెట్టి ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మధ్య చిచ్చు రేగిందని ఒక టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.
వీళ్లిద్దరు #RRR సినిమాకి ముందే మంచి స్నేహితులు అని స్వయంగా వాళ్ళే తెలిపారు.రామ్ చరణ్ ఇప్పటికీ అదే స్నేహ భావం తో ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ మాత్రం రామ్ చరణ్ కి సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.ప్రతీ పుట్టినరోజు కి చరణ్ ఇంటికి వెళ్లి సంబరాలు చేసుకుంటాను అని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.
అయితే నిన్న చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ వేడుకలకు టాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరూ వచ్చారు కానీ, ప్రతీ ఏడాది చరణ్ పుట్టినరోజు కి ఇంటికి వచ్చే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు.ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.జూనియర్ ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా ఆహ్వానం అందినప్పటికీ కూడా ఆయన రాకపోవడాన్ని చూస్తుంటే ఇన్ని రోజులు రామ్ చరణ్ తో స్నేహంగా ఉన్నట్టు నటించాడా అనే సందేహం అభిమానుల్లో కలుగుతుంది.
అయితే ఎన్టీఆర్ ఇలా రామ్ చరణ్ కి దూరం గా ఉండడానికి కూడా ఒక కారణం ఉందని అంటున్నారు, అదేమిటి అంటే జేమ్స్ కెమరూన్ రామ్ చరణ్ ని పొగిడిన వీడియోని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ట్వీట్ ద్వారా తెలపడం,మూవీ టీం మొత్తానికి HCA అవార్డు వస్తే , అది కేవలం రామ్ చరణ్ మరియు రాజమౌళి కి వచ్చినట్టు ప్రాజెక్ట్ చెయ్యడం వంటివి జూనియర్ ఎన్టీఆర్ కి నచ్చలేదట.అందుకే ఆయన చరణ్ కి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది.