NTR Prashanth Neel Dragon Movie : అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆత్రుతతో ఎదురు చూసే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమాలు విడుదలైనప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం లాంటి ఓపెనింగ్ వసూళ్లు వస్తుంటాయి. అలాంటి ప్రాజెక్ట్స్ లో ఒకటి ఎన్టీఆర్(Junior NTR),ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్'(Dragon Movie) చిత్రం. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ చిత్రం, అప్పుడే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ లో రీసెంట్ గానే ఎన్టీఆర్ మీద ఒక దేశభక్తి సాంగ్ ని చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తర్వాత ఎన్టీఆర్ ఆగష్టు 14 న విడుదల అవ్వబోయే ‘వార్ 2 ‘ ప్రొమోషన్స్ కి డేట్స్ ని కేటాయించాడు. ఒక నెల రోజుల పాటు ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు. తదుపరి షెడ్యూల్ ని నేరుగా సెప్టెంబర్ నెలలో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఆ షెడ్యూల్ లో ఒక ఐటెం సాంగ్ ని కూడా చిత్రీకరించబోతున్నారట మేకర్స్. ఈ ఐటెం సాంగ్ కోసం ఇద్దరు హీరోయిన్స్ ని పరిగణలోకి తీసుకుంటున్నారట. వారిలో ఒకరు రష్మిక(Rashmika Mandanna) కాగా, మరొకరు కేతిక శర్మ(Ketika Sharma). రష్మిక ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయలేదు. ఈ సినిమాకు ఆమె చేయడానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ మంచి క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ సినిమా కావడంతో భారీ రెమ్యూనరేషన్ ఇస్తే చేసే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క కేతిక శర్మ పేరుని కూడా పరిశీలిస్తున్నారు. రీసెంట్ గానే ఈమె ‘రాబిన్ హుడ్’ చిత్రం లో ‘అది దా సర్ప్రైజ్’ పాటతో ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కుర్రకారులు కేతిక శర్మ హాట్ పెర్ఫార్మన్స్ కి మెంటలెక్కిపోయారు. ఇప్పటికీ ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. అలా యూత్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపిన కేతిక శర్మ పేరు ని కూడా పరిశీలిస్తున్నారట.
అందుతున్న సమాచారం ప్రకారం అధిక శాతం మంది కేతిక శర్మ నే ఖరారు అయ్యినట్టు చెప్తున్నారు. రష్మిక అంటే పాన్ ఇండియన్ హీరోయిన్. కచ్చితంగా రెమ్యూనరేషన్ కూడా ఆ రేంజ్ లోనే అడుగుతుంది. కేతిక శర్మ తో అయితే కేవలం రెండు కోట్ల రూపాయలతో క్వాలిటీ ఐటెం సాంగ్ ని షూట్ చేయించవచ్చనే ఆలోచనలో ఉన్నారట. ఒకవేల కేతిక శర్మ కి ఈ అదృష్టం వరిస్తే ఆమెకు రాబోయే రోజుల్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే శ్రీలీల కూడా ‘పుష్ప 2’ చిత్రం తో పాన్ ఇండియా లెవెల్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆమెకు వరుసగా బాలీవుడ్ లో అవకాశాలు క్యూలు కడుతున్నాయి. అదే తరహాలో కేతిక శర్మ కి కూడా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.
A sizzling cameo loading?#NTRNeel #Dragon #JrNTR #KetikaSharma #RashmikaMandanna pic.twitter.com/qQcjM9fAx1
— The Cine Gossips (@TheCineGossips) June 30, 2025