LRS
LRS: తెలంగాణ ఫ్రభుత్వం(Telangana Government) భూముల క్రమబద్ధీకరణ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్(BRS)ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్(LRS)(లేఔట్ రెగ్యులరైజేన్ స్కీం)పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు సమీక్ష చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసినవారికి కూడా ఎల్‌ఆర్‌ఎస్‌లో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్(Registration)అయిన లేఔట్లలో మిగిలిన ప్లాట్లు కూడా క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
నిషేజితా జాబితాపై అప్రమత్తం..
ఇదే సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో నిసేధిత జాబితాలోని భూములు క్రమబద్ధీకరణ చేసుకోకుండా చూడాలని ఆదేశించింది. సబ్ రిజిస్ట్రార్(Sub-Registrat)కార్యాలయాల వద్ద చెల్లింపులు జరిపిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఒక లేఔట్‌లో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే మిగిలిన 90 శాతం కూడా ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపింది.
25 శాతం రాయితీ..
ఇదిలా ఉంటే.. క్రమబద్ధీకరణకు చెల్లించే ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అంటే రూ.లక్ష చెల్లించాల్సిన వారు రూ.75 వేలు చెల్లించి ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. ఈ అవకాశం మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద చెల్లింపులు జరిపి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుల పరిశీలన..
ఇదిలా ఉంటే.. 2020లో అప్పటి కేసీఆర్(KCR) సర్కార్ ఈ ఎల్‌ఆర్‌ఎస్ స్కీం అందుబాటులోకి తెచ్చింది. తర్వాత కోర్టు కేసుల కారణంగా క్రమబద్ధీకరణ జరుగలేదు. కోర్టు తీర్పు 2023లో వచ్చింది. అయితే అప్పటికే ఎన్నికలు సమీపించడంతో క్రమబద్ధీకరణ ఆగిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి క్రమబద్ధీకరించాలని సూచించింది. దీంతో ఇప్పటికే అధికారులు రెగ్యులరైటేజషన్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు.