https://oktelugu.com/

పాకిస్తాన్ – ఇండియా యుద్ధం నేపథ్యంలో ఎన్టీఆర్ ‌సినిమా !

సౌత్ డైరెక్టర్స్ లో నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ లో రాజమౌళి తరువాత ‘ప్రశాంత్ నీల్’ అనే చెప్పాలి. ప్రశాంత్ ద‌ర్శ‌క‌త్వంలో రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 క్రియేట్ చేసిన రికార్డ్స్ నాన్ బాహుబలి రేంజ్ రికార్డ్స్ గా నిలిచాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ యాక్షన్ డ్రామా దాదాపు 250 కోట్ల‌ వసూళ్లు సాధించిందంటే.. అది కేవలం ప్రశాంత్ నీల్ దర్శకత్వ పనితనమే. కాగా ఈ […]

Written By: , Updated On : October 6, 2020 / 01:50 PM IST
Follow us on

సౌత్ డైరెక్టర్స్ లో నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ లో రాజమౌళి తరువాత ‘ప్రశాంత్ నీల్’ అనే చెప్పాలి. ప్రశాంత్ ద‌ర్శ‌క‌త్వంలో రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 క్రియేట్ చేసిన రికార్డ్స్ నాన్ బాహుబలి రేంజ్ రికార్డ్స్ గా నిలిచాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ యాక్షన్ డ్రామా దాదాపు 250 కోట్ల‌ వసూళ్లు సాధించిందంటే.. అది కేవలం ప్రశాంత్ నీల్ దర్శకత్వ పనితనమే. కాగా ఈ యాక్షన్ డైరెక్టర్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆసక్తికరమైన గాసిప్ ఏమిటంటే ఈ చిత్రం పీరియాడిక్ మూవీ అని, పాకిస్తాన్ – ఇండియా విడిపోయిన కాలంలో జరిగిన కొన్ని పరిస్థుతుల ఆధారంగా కథ మొదలవుతుందట.

Also Read: మహేష్ బాబునే ఇంతలా భయపెట్టారంటే?

అలాగే ఆ తరువాత పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధం వరకూ.. ఆ యుద్ధంలో ఇండియా గెలుపు కోసం ఎంత గొప్పగా పోరాటం చేశారనే కోణంలో ప్రశాంత్ ఈ సినిమాని తీయాలనుకుంటునట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 250 కోట్ల బడ్జెట్లో నిర్మించనున్నారని.. పైగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు బల్క్ డేట్స్ కేటాయిస్తున్నారని.. 2022లో సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లనుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ను పూర్తి చేసాకే ప్రశాంత్ ఈ సినిమాని మొదలుపెడతాడు. మొత్తానికి కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది పాన్ ఇండియా లెవల్లో.

Also Read:బిగ్‌ బాస్‌ కు నాగార్జున దూరం.. ఏం జరుగనుంది?

అందుకే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్‌తో చేసిన తరువాత బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తో కూడా సినిమా చేసే ఆవకాశం వచ్చింది. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. దాదాపు ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయింది. త్వరలోనే ప్రశాంత్ షాహిద్ కపూర్ ని మీట్ అవ్వనున్నారని, కథ చెప్పడానికే కలుస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల పై మాఫియా కన్ను ఎలా ఉండేది అనే క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.