Movies With Flop Talk: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ లో చాలా మాస్ ఫాలోయింగ్ ఉంది. ఏ హీరోకు లేనంత మాస్ పాలోయింగ్ ఈయనకే సొంతం. చిన్న వయసులోనే విపరీతమైన మాస్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు తారక్. అయితే ఆయన సినీ కెరీర్‌లో ఒక సమయంలో వరుస ప్లాపులను చవిచూశారు. ఆయన స్టార్ హీరో కాబట్టి.. ఏ సినిమా రిలీజ్ అయినా.. అంచనాలు ఆకాశంలో ఉండేవి.
పైగా ఎన్టీఆర్ నట విశ్వరూపం గురించి అందరికీ తెలిసిందే కాబట్టి.. డైరెక్టర్ ఎవరైనా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉండేది. ఆయన డ్యాన్సులు, నటన, హావభావాలు ఇవన్నీ సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్స్. అందుకే ఆయన సినిమాలకు జనాలు ఎగబడి చూస్తుంటారు. కానీ భారీ అంచనాల నడుమ సినిమా వచ్చి ప్లాప్ అయితే అది మామూలు దెబ్బ కాదు.
కానీ సినమా రంగంలో చాలా మ్యాజిక్‌లు జరుగుతుంటాయి. ఎందుకంటే రిలీజ్ అయిన మొదటి రెండు లేదా మూడు రోజుల వరకు ప్లాప్ టాక్ వినిపించినా.. కూడా ఆ తర్వాత అదే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇలాంటి మ్యాజిక్ తారక్ జీవితంలో కూడా ఉంది. ఆ మూవీనే నాన్నకు ప్రేమతో. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన మూవీ ఇది.
పైగా వరుస ప్లాపుల తర్వాత ఎన్టీఆర్ టెంపర్ మూవీతో మాస్ హిట్ కొట్టాడు. దీని తర్వాత వస్తున్న మూవీ కావడం.. పైగా సుకుమార్ డైరెక్ట్ చేయడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ మూవీ ట్రైలర్ చూశాక.. అందరి మతులు పోయాయి. ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. 2016లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది.
Also Read: AP Govt Has Massively Increased The Pole Tax: పోల్ బాదుడు.. స్తంభంపై వైరు కడితే పన్ను కట్టాల్సిందే
ఇంకేముంది థియేటర్స్ కూడా హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. ఎన్టీఆర్‌కు తండ్రి సెంటిమెంట్ ను ఎట్టి, గతంలో కంటే చాలా డిఫరెంట్ లుక్‌లో ఎన్టీఆర్ ను చూపించాడు లెక్కల మాస్టర్ సుకుమార్. కానీ మూవీలోని కొన్ని లెక్కల టెక్నిక్స్ చాలామంది అభిమానులకు అర్థం కాక తలలు పట్టుకున్నారు. దీంతో మొదటి రెండు రోజులు ప్లాప్ టాక్ వినిపించింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమేనంటూ అందరూ అనడంతో.. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ టెన్షన్ పడ్డారంట.
పైగా సంక్రాంతికి బాలయ్య డిక్టేటర్ మూవీ, శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజాతో పాటుగా నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా మూవీలు కూడా రిలీజ్ అయ్యాయి. విచిత్రం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ వాటిలాగే మొదటిరోజే నాన్నకు ప్రేమతక్ష మూవీ హిట్ టాక్ తెచ్చుకోలేదు. కానీ అక్కడే మ్యాజిక్ జరిగింది. ఈ మూవీ ప్రేక్షకులకు స్లోగా అర్థం కావడంతో పాటు ఇంట్రెస్టింగ్ అనిపించడం స్టార్ట్ అయింది. దీంతో ప్లాప్ టాక్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వరకు దూసుకుపోయింది. నెల రోజుల పాటు థియేటర్లకు ఈ మూవీ కోసం అభిమానులు క్యూ కట్టారు.
Also Read: Petrol Diesel Price Increase: 5 రోజుల్లోనే రూ.3 పెంపు..ఇంకా పెంచుడేనట.. మోడీ సార్ వదలవా?