https://oktelugu.com/

Koratala Shiva- Jr. NTR: ఎన్టీఆర్ మిడిల్ క్లాస్ కష్టాలు.. సంచలన కథ రాసిన కొరటాల శివ !

Koratala Shiva- Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా కథ గురించి ఫ్యాన్స్ ఊగిపోయే అప్ డేట్ వచ్చింది. ఇంతకీ కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపిస్తాడట. మిడిల్ క్లాస్ సమస్యల నేపథ్యంలో కొరటాల శివ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : October 1, 2022 / 05:54 PM IST
    Follow us on

    Koratala Shiva- Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా కథ గురించి ఫ్యాన్స్ ఊగిపోయే అప్ డేట్ వచ్చింది. ఇంతకీ కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపిస్తాడట. మిడిల్ క్లాస్ సమస్యల నేపథ్యంలో కొరటాల శివ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది.

    Koratala Shiva- Jr. NTR

    సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్ టైన్ గా ఉంటుందట. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 16న నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. కాగా జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

    Also Read: Dhanush Nenu Vastunna: తెలుగు ప్రేక్షకుల పై ధనుష్ ఫ్యాన్స్ నోటి దురుసు.. మ్యాటర్ లేకుండా హిట్ ఎలా అవుతుంది ?

    పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. అటు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ తో రచయితగా సినిమాలు, దర్శకుడిగా చేసిన సినిమా హిట్ అయ్యాయి. అందుకే, ఈ సినిమాకి ఇండియా వైడ్ గా మార్కెట్ అయ్యే అవకాశం ఉంది.

    అందుకే, ఓటీటీ సంస్థలు ఎన్టీఆర్ – కొరటాల కలయికలో రానున్న ఈ సినిమా కోసం పోటీ పడుతున్నాయి. పైగా ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు కూడా ఉంటాయని టాక్ నడుస్తోంది. ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఒకటి కాగా, పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం మరొకటి అట. పల్నాటి నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు.

    Koratala Shiva- Jr. NTR

    ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు. రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా కొరటాల ఈ సినిమాలో ప్రముఖంగా ప్రస్తావిస్తామని తెలుస్తోంది. ఐతే, ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు కొరటాల.

    Also Read:Pranitha Subhash: జిమ్ లో బాపూ బొమ్మ ఎక్సర్ సైజులు.. చూస్తే మనకు చమటలు పడుతాయి..

    Tags