https://oktelugu.com/

Dhanush Nenu Vastunna: తెలుగు ప్రేక్షకుల పై ధనుష్ ఫ్యాన్స్ నోటి దురుసు.. మ్యాటర్ లేకుండా హిట్ ఎలా అవుతుంది ?

Dhanush Nenu Vastunna: ధనుష్ హీరోగా సెల్వరాఘవన్ తీసిన కొత్త కళాఖండం ‘నేనే వస్తున్నా’.. రావొద్దు మహా ప్రభో అంటూ తెలుగు ప్రేక్షకులు మొర పెట్టుకుంటున్నాడు. అయితే, తమిళ ప్రేక్షకులకు నచ్చిన ఈ సినిమా తెలుగు వారికి ఎందుకు నచ్చలేదు ?, ఇది ధనుష్ సినీ కెరీర్ లోనే చరిత్ర సృష్టించే సినిమా అని తమిళ క్రిటిక్స్ పొగుడుతుండగా, తెలుగు మీడియా మాత్రం ఈ చిత్రం ఏమంత బాగోలేదని రాస్తోంది. ఇది విని తట్టుకోలేని తమిళ ధనుష్ […]

Written By:
  • Shiva
  • , Updated On : October 1, 2022 / 05:49 PM IST
    Follow us on

    Dhanush Nenu Vastunna: ధనుష్ హీరోగా సెల్వరాఘవన్ తీసిన కొత్త కళాఖండం ‘నేనే వస్తున్నా’.. రావొద్దు మహా ప్రభో అంటూ తెలుగు ప్రేక్షకులు మొర పెట్టుకుంటున్నాడు. అయితే, తమిళ ప్రేక్షకులకు నచ్చిన ఈ సినిమా తెలుగు వారికి ఎందుకు నచ్చలేదు ?, ఇది ధనుష్ సినీ కెరీర్ లోనే చరిత్ర సృష్టించే సినిమా అని తమిళ క్రిటిక్స్ పొగుడుతుండగా, తెలుగు మీడియా మాత్రం ఈ చిత్రం ఏమంత బాగోలేదని రాస్తోంది. ఇది విని తట్టుకోలేని తమిళ ధనుష్ అభిమానులు తెలుగు వాళ్ళకి ఐటెం సాంగులు, నేల విడిచి సాము చేసే పోరాటాలు మాత్రమే నచ్చుతాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

    Dhanush

    ధనుష్ నటించిన ‘నేనే వస్తున్నా’ సినిమాలో ఉన్న గొప్పదనం తెలుగు వాళ్ళు గుర్తించడం లేదని ఆ తమిళ నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. నిజానికి నేనే వస్తున్నా సినిమా టాలీవుడ్ కి పెద్దగా కనెక్ట్ కాలేదు. అయినా ధనుష్ మీద అభిమానంతో థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకి, సినిమా చాలా నెమ్మదిగా సాగటం, చెప్పుకోవడానికి ఒక మంచి పాట గానీ, ఫైట్ గానీ లేకపోవడం తెలుగు ప్రేక్షకులని నేనే వస్తున్నా చిత్రం నిరాశకు గురిచేసింది.

    Also Read: Pranitha Subhash: జిమ్ లో బాపూ బొమ్మ ఎక్సర్ సైజులు.. చూస్తే మనకు చమటలు పడుతాయి..

    నేనే వస్తున్నా అంటూ తన కథలో ఏమాత్రం ఆసక్తి కరమైన మలుపులు లేకుండా సెల్వ రాఘవన్ ఈ సినిమా తీశాడు. ఈ విషయంలో ఈ చిత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. తమిళ ప్రేక్షకులు బాహుబలిని, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ను ఆదరించారంటే అది రాజమౌళి, ప్రశాంత్ నీల్ గొప్పతనం. రాజమౌళి, ప్రశాంత్ ఇద్దరూ తమ సినిమాలని భాషాబేధం లేకుండా ప్రపంచమంతా ఆదరించే విధంగా మలిచారు.

    Dhanush

    కానీ ఇక్కడ సెల్వ రాఘవన్ ‘నేనే వస్తున్నా’ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు కూడా నచ్చేలా తెరకెక్కించలేక పోయాడు. అయినా సినిమాలో పస ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆ సినిమా ఎక్కడైనా ఆడుతుంది. గతంలో ఎన్నో తమిళ చిత్రాలు తెలుగులో గొప్ప విజయాలు సాధించాయి. కానీ నేనే వస్తున్నా ఆడలేదు అంటే.. దానికి కారణం ఆ సినిమాలో కంటెంట్ బాగాలేదు అని అర్థం.

    బాగుంటే.. నేనే వస్తున్నా చిత్రం ఇంటర్వెల్ కే తెలుగు ప్రేక్షకులు ఎందుకు బోర్ ఫీల్ అవుతారు ?, అసలు కొందరు అయితే, మలి సగం చూడకుండానే ఎందుకు లేచి వెళ్ళిపోతారు ?, అన్నిటికీ మించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ సినిమాలో ఒక్క తెలుగు ఆర్టిస్టు కూడా లేడు గా! అయినా దర్శకుడు సెల్వ రాఘవన్ సినిమాల మీద పట్టు కోల్పోయి చాలా ఏళ్ళు అయింది.

    Also Read:Sri Reddy On Bigg Boss 6 Telugu: నాగార్జున రంగేసుకుని అలా చేస్తాడు.. బిగ్ బాస్ పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్

    Tags