NTR Latest Look: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్…నందమూరి ఫ్యామిలీ మూడోవ జనరేషన్ ని ముందుకు తీసుకెళుతున్నాడు. ఈ స్టార్ హీరో చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కతాంశమైతే ఉంటుంది. మరి దీనికి అనుగుణంగానే ఆయన చేసిన దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ని సాధించింది. ఇక దేవర సినిమా కలెక్షన్స్ పరంగా కొంతవరకు వీక్ అయింది. కేవలం 500 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టడంతో ఈ సినిమా మీద మేకర్స్ పెట్టుకున్న అంచనాలను అందుకోలేక పోయింది. ఇక రీసెంట్ గా హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.
మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా మీదనే ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఇక డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి న్యూస్ కూడా ఒక ట్రెండ్ సృష్టిస్తుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ను చూసిన చాలా మంది ఆయనేంటి ఇంతలా వీక్ అయిపోయాడు. అంతలా ఎక్సర్ సైజులు చేయాల్సిన అవసరం ఏముంది? దేవర సినిమాలో చాలా మంచి మెకోవర్ తో కనిపించాడు.
అలాంటి లుక్ లోనే ఉంటే బాగుండేది కదా అని మరి కొంతమంది కామెంట్ చేస్తూ ఉండటం విశేషం. మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సలార్ సినిమాలో ప్రభాస్ ను ఏ విధంగా అయితే ఎలివేట్ చేసి చూపించాడో ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని అంతకుమించిన ఎలివేషన్స్ తో చూపించడానికి రెడీ అవుతున్నట్టు గా తెలుస్తోంది…
ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ను ఎవ్వరు చూపించిన విధంగా ప్రశాంత్ నీల్ చూపించడానికి రెడీ అయ్యాడు అందుకే ఆయన చేత ఇలాంటి వర్కౌట్స్ చేస్తున్నాడు అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండడం విశేషం…ఎన్టీఆర్ ను చూసిన అతని ఫ్యాన్స్ వాళ్ల అభిమాన హీరో అలా కష్టపడి పోతుంటే చూడలేకపోతున్నారు…
View this post on Instagram