Mahesh-Trivikram Movie: దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ మూవీ ప్రకటించి చాలా కాలం అవుతుంది. 2022 ప్రారంభంలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా అయ్యారు. అదే సమయంలో భీమ్లా నాయక్ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందిస్తూ అన్నీ తానై వ్యవహరించడంతో ఆయనకు కూడా తీరిక లేకుండా పోయింది. కొద్ది నెలల క్రితం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించారు. హీరోయిన్ పూజా హెగ్డే తో పాటు నమ్రత శిరోద్కర్, త్రివిక్రమ్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక చకచకా షూటింగ్ ప్రారంభం అవుతుందనుకుంటే ఆ సూచనలు కనిపించడం లేదు.

ఈ క్రమంలో అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సంతృప్తి చెందని మహేష్ బాబు సెకండ్ హాఫ్ కి కొన్ని మార్పులు సూచించారట. ఈ క్రమంలో మహేష్ సూచనల మేరకు స్క్రిప్ కి మెరుగులు దిద్దే పనిలో త్రివిక్రమ్ ఉన్నారట. అందుకే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లడం లేటైంది అంటున్నారు. అలాగే హీరోయిన్ పూజాను తప్పించినట్లు మరికొన్ని పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. పూజా దర్శకుడు త్రివిక్రమ్ ఫేవరేట్ హీరోయిన్ గా ఉండగా.. ఆమె తప్పించే ఛాన్స్ లేదని కొందరు వాదిస్తున్నారు.
Also Read: YouTube Queen Sejal Kumar: యూట్యూబ్ ప్రపంచంలో “క్వీన్ “సెజల్ కుమార్
ఇక ఎస్ఎస్ఎంబి 28 చుట్టుకున్న మరికొన్ని పుకార్లను పరిశీలిస్తే జులై నుండి ఏ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకోనుందట. హైదరాబాద్ శివారులో ఓ భారీ కాలనీ సెట్ సైతం ఏర్పాటు చేశారట. అయితే ఇన్ని కన్ఫ్యూషన్స్ ఎందుకు అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇవ్వొచ్చుగా అనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అలాగే లేని పోని పుకార్లతో మూవీపై నెగిటివ్ ఇంపాక్ట్ తేవడం ఎందుకని సలహా ఇస్తున్నారు. ఇప్పటికైనా ఎస్ఎస్ఎంబి 28 టీం రెగ్యులర్ షూటింగ్ పై క్లారిటీ ఇస్తే బాగుండు.

ఇక మహేష్ వరుస విజయాలతో జోరుమీదున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది. మహేష్ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక త్రివిక్రమ్ మూవీ అనంతరం మహేష్ పాన్ ఇండియా చిత్రానికి సిద్ధం అవుతాడు. మహేష్ 29వ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించనున్నారు. మహేష్, రాజమౌళి చిత్రం కోసం రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు గట్టిగా వినిపిస్తుంది.
Also Read:South Indian Movies: ప్రేక్షకుల టేస్ట్ మారింది: బాలీవుడ్ భారీ ఫ్లాప్స్.. సౌత్ ఇండస్ట్రీ సూపర్ హిట్స్