Devara Movie : ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ కాగా… ఎన్టీఆర్ సోలోగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఆరేళ్ళు అవుతుంది. అరవింద సమేత వీరరాఘవ 2018లో విడుదలైంది. ఇన్నేళ్ళలో ఎన్టీఆర్ చేసింది ఒక సినిమా మాత్రమే. ఆర్ ఆర్ ఆర్ విడుదలైన రెండున్నరేళ్ళకు దేవర థియేటర్స్ లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
సెప్టెంబర్ 27న దేవర విడుదల కానుంది. వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా దేవర చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్. దేవర థియేట్రికల్ ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబట్టింది. నార్త్ లో సైతం దేవరకు భారీ హైప్ ఉంది. ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ చాలా సీరియస్ గా చేస్తున్నారు.
చెన్నై, బెంగుళూరు, ముంబై నగరాల్లో ఆయన ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించారు. భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి. అప్డేట్స్ చెప్పిన సమయానికి రాకపోవడం ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేస్తుంది. దేవర రిలీజ్ ట్రైలర్ నేడు 11: 07 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. తీరా చూస్తే ట్రైలర్ విడుదల కాలేదు. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ట్రైలర్ కోసం వేచి చూసిన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు.
ఆయుధ పూజ సాంగ్ విషయంలో కూడా ఇలానే జరిగింది. చెప్పిన సమయానికి అప్డేట్ రాలేదు. చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్… ప్రకటించిన సమయానికి అప్డేట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నేడు విడుదల కావాల్సిన థియేట్రికల్ ట్రైలర్ వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
దేవర టీమ్ నుండి థియేట్రికల్ ట్రైలర్ విడుదలపై ఎలాంటి అప్డేట్ లేదు. మరోవైపు యూఎస్ లో దేవర చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కుతుంది. రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. అప్పుడే దేవర రూ. 25 కోట్ల మార్క్ దాటేసింది అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లు వసూలు చేస్తే కానీ దేవర హిట్ స్టేటస్ అందుకుంటుందని సమాచారం. దేవర మూవీ ఎన్టీఆర్ స్టామినా తెలియజేసే చిత్రంగా ప్రేక్షకులు చూస్తున్నారు. అలాగే నార్త్ లో ఈ స్థాయి విజయం సాధిస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది.