https://oktelugu.com/

 Game Changer Movie :  గేమ్ చేంజర్ సినిమాలో ఇద్దరు రామ్ చరణ్ లు ఉన్నారా..? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోల్లో మెగాస్టార్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న చాలా సినిమాలు తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనను తాను స్టార్ హీరో ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 22, 2024 1:18 pm
    Game Changer Movie

    Game Changer Movie

    Follow us on

    Game Changer Movie :   మెగాస్టార్ తనయుడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం తనదైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన స్టార్ హీరోగా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న చాలా సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు. మరి ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఇప్పటికే విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా టీజర్ గాని, ట్రైలర్ గానీ ఏది రాలేదు. అయినప్పటికీ ఈ సినిమా మంచి బజ్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. మరి మొత్తానికైతే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటమే కాకుండా రామ్ చరణ్ కూడా భారీ సక్సెస్ ని సాధించాలనే దిశగా ముందడుగులు వేస్తున్నాడు…ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు అంటూ పలు రకాల వార్తలైతే వస్తున్నాయి. ఇంకా వీటిలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు కానీ లీకైన ఫుటేజ్ ని కనక చూసినట్లైతే ఇందులో ఇద్దరు రామ్ చరణ్ లు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది.

    అయితే శంకర్ క్లైమాక్స్ లో అంతకు మించిన ట్విస్ట్ ఒకటి ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా గేమ్ చేంజర్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం అనేది రామ్ చరణ్ కి చాలా అవసరం… ఎందుకంటే ఆయన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చేసిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది.

    ఆ సినిమాలో ఆయనది చిన్న పాత్ర అయినప్పటికీ అది ప్రేక్షకులను మెప్పించలేకపోవడం విశేషం… కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని ముందుకు దూసుకెళ్తే తప్ప ఆయనకి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవ్వదు. కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు ఆయన భారీ మార్కెట్ ను సంపాదించుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాల్సి ఉంది…

    మరి శంకర్ గత సినిమా అయిన ‘భారతీయుడు 2’ భారీ ప్లాప్ ను మూటగట్టుకోవడంతో ఆయన మీద ఎలాంటి అంచనాలైతే లేవు. ఇక ఉన్నదల్లా రామ్ చరణ్ మీద నమ్మకం మాత్రమే… మరి ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపుతారా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…