Allu Arjun : పుష్ప 2 లో ఆ ఒక్కటి చేయలేకపోతున్న అల్లు అర్జున్…కారణం ఏంటంటే..?

ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళకి భయం పట్టుకుంటుంది. కారణం ఏంటంటే మనవాళ్ళు ప్రస్తుతం పాన్ ఇండియా లో భారీ సక్సెస్ లు సాధిస్తున్నారు...

Written By: Gopi, Updated On : September 22, 2024 1:00 pm

Allu Arjun dance

Follow us on

Allu Arjun :  తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్… ప్రస్తుతం ఈయన సుకుమార్ దర్శకత్వంలో ‘ పుష్ప 2’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం లో ఉన్నాడు. ఇక సుకుమార్ అంటే ఇంటలిజెంట్ డైరెక్టర్ అనే విషయం మనకు తెలిసిందే. ఇంతకు ముందు ఆయన చేసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఈయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

మరి వాటికి తగ్గట్టుగానే ఈయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే గతంలో ఈయన చేసిన రంగస్థలం సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. ఇక పుష్ప సినిమా కూడా బాలీవుడ్ లో భారీ అంచనాలను అందుకుంది. తెలుగులో అంతగా ఆడకపోయిన కూడా బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం పుష్ప సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అందువల్లే ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అనగానే అందరికీ ముందుగా డాన్స్ గుర్తుకొస్తుంది.

ఆయన మొదటి నుంచి కూడా డాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చాడు. అల్లు అర్జున్ సినిమా వస్తుంది అంటే సినిమా సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్ అయిందా? అనేదానికంటే కూడా అతని అభిమానులు ఆ సినిమాలో మా హీరో ఎలాంటి స్టెప్పులు వేశాడు అనేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటి అల్లు అర్జున్ గత కొన్ని సినిమాల నుంచి అంత బాగా డాన్స్ చేయలేకపోతున్నాడు. పుష్ప సినిమాలో అయితే ఆయనకు డాన్స్ కు స్కోప్ ఉన్న సాంగ్స్ పడలేదు.

కాబట్టి పుష్ప 2 సినిమాలో అయిన తన డాన్స్ తో ఇరగదీస్తాడు అని అనుకుంటున్నా అభిమానులకు మరోసారి చేదువార్త ఎదురయింది. ఎందుకంటే ఈ సినిమాలో కూడా పెద్దగా డాన్స్ కి స్కొప్ ఉండే సాంగ్స్ లేవట… ఇక సిచువేషన్ కి తగ్గట్టుగా వచ్చే సాంగ్స్ తప్ప మిగతావి ఏవి కూడా తన డాన్స్ కి ప్రాధాన్యం ఇచ్చే సాంగ్స్ లేవట. సుకుమార్ మాత్రం ఈ సినిమాతో పాన్ ఇండియాలో మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఈ దెబ్బతో ఆయన రాజమౌళి తర్వాత పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్ గా తన పేరు నమోదు చేసుకోవాలని చూస్తున్నాడు…