NTR and Kalyan Ram : నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి జానకి రామ్(Nandamuri Janaki Ram) కుమారుడు తారక రామారావు(Nandamuri Taraka Ramarao) మొదటి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్ లో జరిగాయి. ఈ ఈవెంట్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, ఎంపీ పురందేశ్వరి లతో పాటు పలువురు రాజకీయ నాయకులూ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వై వీ ఎస్ చౌదరి దర్శకత్వం లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న వై వీ ఎస్ చౌదరి, ఈ సినిమాతో భారీ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆయన సతీమణి నిర్మిస్తుంది. ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన వీడియో ని కాసేపటి క్రితమే విడుదల చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. తారక రామారావు లుక్స్ కి నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read : కళ్యాణ్ రామ్ కు జూ. ఎన్టీఆర్ ఎందుకు సారీ చెప్పారు.. ఆ కథేంటి?
ఇక ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా వీణా రావు అనే తెలుగమ్మాయి ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే జానకి రామ్ సోదరులు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) ఈ ఈవెంట్ కి హాజరు కాకపోవడం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్న విషయం. సొంత అన్నయ్య కొడుకు సినిమా లాంచ్ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏమిటి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో లేడు, లండన్ లో ఉన్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. లండన్ లో ఆల్బర్ట్ హాల్ లో #RRR మూవీ లైవ్ షో కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ అందుకే రాలేకపోయాడని అభిమానులు అంటున్నారు.
మరి కళ్యాణ్ రామ్ రాకపోవడానికి కారణం ఏమిటి?, అతను ఇక్కడే హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా అనే లాజిక్స్ ని తీసుకొచ్చారు నెటిజెన్స్. మూవీ టీం వీళ్ళిద్దరినీ ఆహ్వానించలేదా?, ఒకవేళ ఆహ్వానించినా రాలేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే చాలా కాలం నుండి నారా ఫ్యామిలీ తో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. నేడు నారా భువనేశ్వరి రావడం వల్లనే వీళ్లిద్దరు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈవెంట్ కి రాకపోయినా పర్వాలేదు కానీ, కనీసం సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలైన తెలియజేస్తే బాగుండును అని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుండి కానీ. కళ్యాణ్ రామ్ నుండి కానీ ఒక్క ట్వీట్ కూడా పడలేదు. ఈరోజు ముగిసేలోపు ట్వీట్స్ వేస్తారో లేదో చూడాలి. గతంలో పుట్టినరోజు కి అన్నదమ్ములిద్దరూ తారకరామారావు (జానకి రామ్ తనయుడు) కి శుభాకాంక్షలు తెలియజేసారు. కాబట్టి ఈసారి కూడా రెస్పాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : తమ్ముడు ఎన్టీఆర్ వెంట కళ్యాణ్ రామ్.. ‘నందమూరి’ కుటుంబానికి దూరం.. బాబుకు షాక్ లగా!