NTR: ఒకప్పుడు టాలీవుడ్ హీరోల క్రేజ్ తెలుగు గడ్డకు మాత్రమే పరిమితం. మన ఆడియన్స్ మాత్రమే వారి చిత్రాలను ఆదరించేవారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగు స్టార్స్ కి మార్కెట్ ఉండేది కాదు. గత దశాబ్ద కాలంలో సమీకరణాలు మారిపోయాయి. టాలీవుడ్ స్టార్స్ సంచలనాలు నమోదు చేస్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. అల్లు అర్జున్ కి కేరళతో పాటు నార్త్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. నార్త్ ఆడియన్స్ కి అల్లు అర్జున్ బాగా తెలుసు.
అలాగే తెలుగు హీరోల క్రేజ్ ఎల్లలు దాటేయడం మనం చూస్తున్నాం. ప్రభాస్ కి పలు దేశాల్లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్ దేశంలో ఆయనకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కోసం అభిమానులు జపాన్ నుండి ఇండియా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే 29 ఏళ్ల క్రితమే రజినీకాంత్ కి అక్కడ అభిమాన వర్గం ఉంది. రజినీకాంత్ సినిమాలు జపాన్ లో కూడా విడుదలయ్యేవి. 1995లో విడుదలైన ముత్తు అక్కడ సంచలన విజయం నమోదు చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది.
ముత్తు రికార్డు ని ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ చేసింది. అంటే దాదాపు మూడు దశాబ్దాలు అక్కడ ముత్తు వసూళ్లను మరో ఇండియన్ మూవీ అధిగమించలేదు. బాహుబలి 2కి కూడా ఆ ఫీట్ సాధ్యం కాలేదు. కాగా జపాన్ లో ప్రభాస్, రజినీకాంత్ కి మించిన క్రేజ్ ఎన్టీఆర్ కి ఉంది. ఆర్ ఆర్ ఆర్ కి ముందే ఎన్టీఆర్ చిత్రాలు జపాన్ లో కూడా విడుదలయ్యేవి. ఎన్టీఆర్ యాక్టింగ్, డాన్సులు అంటే అక్కడి ఆడియన్స్ కి మహా ఇష్టం అట. అలాగే చైనా దేశంలో కూడా ఎన్టీఆర్ ని ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారని సమాచారం.
రానున్న కాలంలో ఎన్టీఆర్ జపాన్, చైనా దేశాల్లో బ్లాక్ బస్టర్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. పలువురు జపాన్ యూట్యూబర్స్ ఎన్టీఆర్ మూవీలోని పాటలను కవర్ సాంగ్స్ గా చేస్తారు. సదరు వీడియోలకు మంచి ఆదరణ దక్కుతుంది. అటు జపాన్ లో ఇటు ఇండియాలో ఆ వీడియోలను ఆడియన్స్ చూస్తున్నారు. అదన్నమాట సంగతి. దేవరతో మంచి హిట్ అందుకున్న ఎన్టీఆర్, వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అనంతరం ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్ లతో సినిమాలు చేయనున్నారు.