https://oktelugu.com/

కశ్మీరు రాత మారుస్తున్న కేంద్రం.. ఏం చేయబోతుంది..?

జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ రెండు ప్రాంతాలకు తాజాగా రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ నిధులు దీన్‌దయాల్‌ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మీడియాకు తెలిపారు. 375 ఆర్టికల్‌ రద్దయిన తరువాత ప్రభుత్వం ఈ ప్రాంతాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలపై తాజాగా విడుదల చేసిన నిధులు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 / 12:12 PM IST
    Follow us on

    జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ రెండు ప్రాంతాలకు తాజాగా రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ నిధులు దీన్‌దయాల్‌ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మీడియాకు తెలిపారు. 375 ఆర్టికల్‌ రద్దయిన తరువాత ప్రభుత్వం ఈ ప్రాంతాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలపై తాజాగా విడుదల చేసిన నిధులు ఏ మేరకు అభివృద్ధి జరుగుతోందనని పలువురు చర్చించుకుంటున్నారు.

    Also Read: ఉన్నట్టుండి.. ఏపీలో ఈ ఎర్రచందనం రాజకీయం ఏంది..?

    వచ్చే ఐదేళ్లలో జమ్మూ, కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 10.58 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టనున్నారు. ఇక విద్యా విధానంలో భాగంగా ‘స్ట్రెంతెనింగ్‌ టీచింగ్‌- లెర్నింగ్‌ అండ్‌ రిజల్ట్స్‌ ఫర్‌ స్టేట్స్‌ (స్టార్స్‌) ప్రాజెక్టును కేంద్రం ఆమోదించింది. రూ. 5718 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రూ.3700 కోట్లు ఇవ్వనుంది.

    ఫెర్‌ఫామెన్స్‌ అసెన్‌మెంట్‌, రివ్యూ అండ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ ఫర్‌ హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌’ కింద ఈ నిధులతో స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌ పోర్టల్‌, టెక్నికల్‌ వర్క్‌షాపుల వంటి వాటిని ఏర్పాటు చేస్తుంది. ఇదే తరహాలో ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో చేపట్టిన ప్రాజెక్టును గుజరాత్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, అసోం రాష్ట్రాల్లో అమలు చేయనున్నారు.

    Also Read: అప్పుడు వాజ్ పేయి.. ఇప్పుడు మోడీ.. పెట్రోల్ పై సంచలన నిర్ణయం?

    ఇక ముడి చమురు నిల్వ కోసం చేసిన రూ.3874 కోట్ల వ్యయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో 2 దశాబ్దాల కనిష్ఠానికి చేరిన విషయం తెలిసిందే. జనవరిలో 60 డాలర్ల దాకా ఉన్న బ్యారెల్‌ ఆ తరువాత 19 డాలర్లకు పడిపోయింది. ఈ సమయంలో 16.71 మిలియన్‌ బ్యారెళ్ల చమురును అధికంగా కొని విశాఖపట్నం, మంగుళూరు, పదూర్‌ చములు క్షేత్రాలో నిల్వ చేసింది. ఈ మొత్తానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.