Senior NTR : తెలుగు తెరపై చెరగని ముద్ర వేశాడు నందమూరి తారక రామారావు. ఆయన సాధించిన విజయాలు చిరస్మరణీయం. పౌరాణిక, సాంఘిక, జానపద, డివోషనల్… అన్ని జోనర్స్ ని ఆయన టచ్ చేశాడు. రాముడు, కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకు ప్రాణం పోశాడు. రాముడు, కృష్ణుడు నిజంగా ఇలా ఉండేవారా.. అని సామాన్యులు ఆయన్ని చూసి భావించేవారు. 70 తర్వాత ఎన్టీఆర్ మాస్, కమర్షియల్ సబ్జక్ట్స్ చేశాడు. డ్రైవర్ రాముడు, అడవి రాముడు, యమలీల, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, సర్దార్ పాపారాయుడు ఈ కోవకు చెందిన చిత్రాలు.
1982లో పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. చైనత్య రథయాత్ర పేరుతో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాగా ఎన్టీఆర్ కాగా ఎన్టీఆర్ కి నమ్మకాలు చాలా ఎక్కువ. దైవ చింతన కూడా మెండుగా ఉండేది. ఈ క్రమంలో రాజకీయాల్లోకి రాకముందు ఎన్టీఆర్ తన ఒంటి పై ఒక టాటూ వేయించుకున్నారట.
ఎన్టీఆర్ ఒంటి పై ఉన్న టాటూ ఓం అట. ఎన్టీఆర్ ఒంటిపై ఓం టాటూ ఉంటే మంచి జరుగుతుందని ఎవరో చెప్పారట. రాజకీయాల్లో రాణించడం కోసం ఎన్టీఆర్ ఆ టాటూ తన శరీరం మీద వేయించుకున్నారట. కాగా రాజకీయంగా ఎన్టీఆర్ సక్సెస్ తో పాటు ఫెయిల్యూర్ కూడా చూశాడు. ఒకసారి నాదెండ్ల భాస్కరరావు, మరోసారి నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని నుండి పదవి లాక్కున్నారు.
1995 లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. అలాగే కుటుంబానికి కూడా దూరమయ్యాడు. లక్ష్మి పార్వతితో చివరి రోజుల్లో గడిపారు. 1996 జనవరి 18న ఎన్టీఆర్ గుండెపోటుతో కన్నుమూశారు. లెజెండ్ అనూహ్యంగా నిష్క్రమించాడు. ఇక ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బాలకృష్ణ రెండు సినిమాలు తీశారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు టైటిల్ తో విడుదలైన ఈ చిత్రాలు విజయం సాధించలేదు.
ఎన్టీఆర్ జీవితం అందరికీ తెలిసినదే. నిజాలు దాచి కొందరికి అనుకూలంగా సినిమాను మలచారనే విమర్శలు వినిపించాయి. ఈ రెండు సినిమాలు డబుల్ కాదు ట్రిపుల్ డిజాస్టర్స్. కనీసం సినిమా ఉచితంగా చూసి వెళ్లండని థియేటర్స్ ఎదుట బోర్డులు పెట్టారు. ఎన్టీఆర్ బయోపిక్ మహానటికి మించి విజయం సాధిస్తుందని భావించారు. కానీ ఎవరూ ఆ చిత్రాలను పట్టించుకోలేదు. అదే సమయంలో ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో బయోపిక్ తెరకెక్కించి వివాదం రాజేశాడు. చక్కగా క్యాష్ చేసుకున్నాడు.
Web Title: Ntr got that tattoo on his body to excel in politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com