NTR – Gopichand: మన టాలీవుడ్ లో ఒక్క సినిమాని పోలిన మరో సినిమా ఉండడం ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నాము..కథ పరంగా ఒక్కేలాగా ఉన్నప్పటికీ కూడా కథనం లో కొత్తదనం చూపించడం వల్ల బ్లాక్ బస్టర్ హిట్లు ,సూపర్ హిట్లు మరియు ఇండస్ట్రీ హిట్లు అయినా సినిమాలు ఎన్నో ఉన్నాయి..ఒక్కే కథ తెరకెక్కిన సినిమాలు కేవలం హిట్ అయినవే కాదు, ఫట్ అయినవి కూడా బోలెడన్ని ఉన్నాయి..అలా ఒక్కే కథతో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఇద్దరు మాస్ హీరోల సినిమాలు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము..ఇక అసలు విషయానికి వస్తే గోపీచంద్ హీరో గా నటించిన వాంటెడ్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా 2011 వ సంవత్సరం లో జనవరి 26 వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది..BVS రవి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో హీరోయిన్ ని ప్రేమిస్తాడు..కానీ హీరోయిన్ ప్రేమించాలంటే తన జీవితం లో ఉన్న కొంతమంది విలన్స్ ని చంపాలి అని షరతు పెడుతుంది..అలా ఆమె ఎందుకు కోరిందో ఫ్లాష్ బ్యాక్ లో మొత్తం చూపిస్తాడు దర్శకుడు.

కాస్త ఇంచుమించుగా ఇదే కథతో దసరా కానుకగా జూనియర్ ఎన్టీఆర్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో అప్పట్లో ఊసరవెల్లి అనే సినిమా వచ్చింది..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా ఓపెనింగ్స్ లో సూపర్ అనిపించుకున్నప్పటికీ ఫుల్ రన్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది..ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ తమ్మన్న కోరిక మేరకు ఎన్టీఆర్ ఆమె జీవితం లో ఉన్న విలన్స్ అందరిని చంపుతూ ఉంటాడు..అలా చంపడానికి కారణం తమన్నా ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు.
Also Read: Naga Babu: జనసేనతో చిరంజీవి.. నాగబాబు క్లారిటీ.. ఏపీలో పొత్తులు ఎత్తులు

ఇలా ఒక్కే కథ తో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ రెండు సినిమాలు కూడా ఒక్కే ఏడాది లో విడుదల అవ్వడమే..ఇలా ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు ..ఒక్కే కథాంశం తో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లో చాలానే ఉన్నాయి.. ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్యా మరియు ప్రభాస్ నటించిన రెబెల్ సినిమాలు కూడా దాదాపుగా ఒక్కేలా ఉంటాయి ..రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్స్ గా మిగిలాయి..అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన పోకిరి సినిమా కి ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి..వీటిల్లో పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, కంత్రి సినిమా ఫ్లాప్ గా మిగిలింది.
Also Read:Singer KK Remuneration: ఒక్క పాట కి KK ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవాడో తెలుసా?