Singer KK: దిగ్గజ గాయకుడు కేకే అలియాస్ కృష్ణ కుమార్ కున్నట్ రెండు రోజుల క్రితం మరణించిన వార్త యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లో ముంచేసిన సంగతి మన అందరికి తెలిసిందే..53 ఏళ్ళ వయస్సులోనే కేకే మన అందరిని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నిజంగా జీర్ణించుకోలేని విషయం..ఆయన లేని లోటు ని ఎవ్వరు పూడవలేరు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వంటి వారు కూడా కేకే కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు అంటే ఆయన సాధించిన ఘన కీర్తి ప్రతిష్టలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు..ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనేది కేకే ని చూసి నేర్చుకోవచ్చు అని ఆయన తో పని చేసిన వారు చెప్తూ ఉంటారు..తానూ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను అనుభవించినవాడు కాబట్టి టాలెంట్ ఎక్కడ ఉన్న ప్రోత్సహించడం లో ఉండు ఉంటాడు కేకే..అందుకే ఆయన అంటే అందరికి అంత అభిమానం..తనకి కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చేంత డిమాండ్ ఉన్నప్పటికీ కూడా చారిటీస్ కోసం ఎన్నో పాటలు లైవ్ ఈవెంట్స్ లో ఉచితంగా పాడిన ఉదార స్వభావం కేకే సొంతం..అందుకే ఆయన ఈరోజు చనిపోతే ఇంత మంది రోదిస్తున్నారు..ఇది ఇలా ఉండగా ఆయన చనిపోయిన సందర్భంగా ఆయన సన్నిహితులు కేకే గురించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

కేకే కి ఒక్క సినిమాలో ఒక్క పాట పాడేందుకు దర్శక నిర్మాతలు మూడు నుండి 5 లక్షల రూపాయిల వరుకు పారితోషికంగా ఇచ్చేవారు అట..కొన్ని చిన్న సినిమాలకు అయితే డబ్బులు తీసుకోకుండా పాడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి..అలాంటి కేకే కొన్ని విషయాలలో మాత్రం చాలా కఠినమైన నిబంధనలు పెట్టుకునేవాడట.

Also Read: Visakhapatnam YCP: విశాఖ వైసీపీలో కుమ్ములాటలు.. ఆధిపత్యం కోసం నేతల ఆరాటం
ఇక అసలు విషయానికి వస్తే కొంత మంది బాగా డబ్బు ఉన్న వారు సినీ తరాలకు కోట్ల రూపాయిలు పారితోషికం ఇచ్చి తమ పెళ్లి ఈవెంట్స్ లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేయిస్తూ ఉండే సంగతి మన అందరికి తెలిసిందే..కేకే ఇలాంటి వాటికి పూర్తిగా దూరం గా ఉంటాడు అట..ఎంత డబ్బు ఇచ్చినా కూడా అలాంటి వాటిల్లో పాల్గొనే సమస్యే లేదు అని తెగేసి చెప్పేవాడు అట..అలా కేకే తాను తనకి విధించుకున్న రూల్స్ చాలా కఠినంగా ఫాలో అయ్యేవాడు అట..అందుకే ఇండస్ట్రీ లో కేకే కి మిగిలిన సింగెర్స్ కి అంత వ్యత్యాసం ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త..ఇది ఇలా ఉండగా కేకే గారి అంత్యక్రియలు ఈరోజు ముంబై లోని వెర్సోవా హిందూ సెర్మెంటోరియం లో అతని కుమ్బా సభ్యుల సమక్షం లో నిర్వహించారు..తమ అభిమాన గాయకుడిని కడసారి చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
Also Read: Director Radha Krishna: రాధాకృష్ణకు కూడా సుజీత్ పరిస్థితేనా?