Ram Charan- NTR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వల్ల ఇద్దరికీ బాగా ప్లస్ అయ్యింది. ఒక్కటి రాజమౌళికి, రెండు చరణ్ కి. రాజమౌళి డైరెక్షన్ స్థాయి ఏంటో బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ తెలిస్తే.. చరణ్ నటనా స్థాయిని ‘ఆర్ఆర్ఆర్’ రెట్టింపు చేసింది. ఐతే, హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకున్న రాజమౌళి ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేయడంలో కొన్ని చోట్ల తడబడ్డాడు. దాంతో అభిమానుల మధ్య ఘర్షణ తలెత్తింది.

మెయిన్ గా ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు. దాంతో, ఎన్టీఆర్ స్థాయి రెండో స్థానానికి పరిమితం అయ్యింది అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. తాజాగా ముంబైలో ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్ మీట్ లో పాల్గొంది టీమ్. ఇదే మంచి టైమ్ అనుకున్న ఓ జర్నలిస్ట్.. ‘ఎన్టీఆర్ కంటే రామ్‌చరణ్ పాత్రను మీరు ఎక్కువ ఎలివేట్ చేశారని రాజమౌళిని అడిగారు.
పైగా ఎన్టీఆర్ కంటే చరణ్ పాత్ర డామినేటింగ్ గా ఉందని.. అలాగే ఎన్టీఆర్ కంటే చరణ్ కే ఎక్కువ మార్కులు పడ్డాయని సదురు జర్నలిస్ట్ అడిగింది. ఈ ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘ఇది పూర్తిగా అబద్ధం. ఒక్క క్షణం కూడా నేను అలా అనుకోను. అసలు డామినేషన్ అన్న పదాన్నే నేను నమ్మను. తారక్, నేను ఇద్దరం బాగా చేశాం. తారక్ ఫెంటాస్టిక్. ఆయనతో కలిసి పనిచేయడం నేను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను.

ఆర్‌ఆర్‌ఆర్ కోసం తారక్ తో చేసిన జర్నీని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నాకు ఈ అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు. ఇక తారక్ పై నాకున్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది’ అని చరణ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే, ఇదే విషయం పై రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్లైమాక్స్ కి లీడ్ అసలు ఎన్టీఆరే, చరణ్ ప్రాణాలు కాపాడింది ఎన్టీఆరే. క్లైమాక్స్ లో ఒక్క ఫైట్ విషయంలో మాత్రమే చరణ్ ను హైలైట్ చేయడం జరిగింది. మిగతా కథ మొత్తం ఎన్టీఆర్ చుట్టే తిరుగుతుంది. అందుకే.. ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం అంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు.