
Bigg Boss 5 Telugu : సోషల్ మీడియాలో.. నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ పై చర్చ గట్టిగానే సాగుతోంది. ఎవరు జోరులో ఉన్నారు.. ఎవరు బోరు కొట్టిస్తున్నారు? అంటూ ఒపీనియన్ పోల్ నడుస్తోంది. వీరిద్దరూ తమ షోలను ఎక్స్ ఛేంజ్ చేసుకోవడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పొచ్చు. బిగ్ బాస్ తొలి షోను జూనియర్ నడిపిస్తే.. ఆ తర్వాత నాగ్ చేతికి వచ్చింది. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ను నాగార్జున రన్ చేయగా.. ఇప్పుడు జూనియర్ కంటిన్యూ చేస్తున్నాడు. దీంతో.. ఎవరు బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారనే చర్చ కొనసాగుతోంది.
తనదైన హోస్టింగ్ తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ ను అద్భుతంగా రన్ చేసిన నాగ్.. ఆ తర్వాత బిగ్ బాస్ షో పగ్గాలు అందుకొని మూడు, నాలుగు సీజన్లుగా సక్సెస్ ఫుల్ గా ముగించారు. మంచి వాక్ఛాతుర్యంతో అటు కంటిస్టెంట్లను, ఇటు ఆడియన్స్ ను అలరించిన ఆయన.. ఇప్పటి వరకూ రెండు సీజన్లను విజయవంతంగా ముగించారు. ఎక్కడా రిమార్కు రాలేదు. ఇప్పుడు ఐదో సీజన్ ను సైతం ఘనంగా ప్రారంభించారు. అయితే.. షో ప్రారంభానికి ముందు హోస్టు గురించి ఎక్కడా చర్చ జరగలేదు. మొదలైన రెండు మూడు రోజుల్లోనే ఈ డిస్కషన్ స్టార్ట్ కావడం గమనార్హం.
2017లో బిగ్ బాస్ తొలి సీజన్ కు హోస్ట్ గా ఉన్న జూనియర్ (jr NTR).. అద్దిరిపోయే యాంకరింగ్ తో ఆకట్టుకున్నాడు. అయితే.. సెకండ్ సీజన్ కు అనివార్య కారణాలతో వైదొలిగాడు. ఆ ప్లేసును నాని భర్తీ చేశాడు. నాని కూడా తనదైన రీతిలో షోను సక్సెస్ ఫుల్ గానే ముగించాడు. ఆ తర్వాత అతను కూడా తప్పుకున్నాడు. ఇక, అప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు విజయవంతంగా రన్ చేసి ఉన్న నాగ్.. బిగ్ బాస్ బాధ్యతలు చేపట్టారు. ఒకటీ, రెండు, మూడు అంటూ అద్భుతంగా బిగ్ బాస్ షోను రన్ చేశాడు. బిగ్ బాస్ షోకు హయ్యెస్ట్ రేటింగ్ 18 పైగా వచ్చింది నాగార్జున (Nagarjuna) ఆధ్వర్యంలోనే. అందుకే.. ఐదో సీజన్ బాధ్యతలు కూడా నాగార్జున చేతిలోనే పెట్టారు నిర్వాహకులు. అయితే.. కొందరు అభిమానులు బిగ్ బాస్ షోకు మళ్లీ జూనియర్ ను తీసుకురావాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండడం గమనార్హం. వచ్చే బిగ్ బాస్ సీజన్ 6లోగానీ.. లేదంటే కనీసం బిగ్ బాస్ 10లోగానీ జూనియర్ ను హోస్టుగా చూడాలని కోరుకుంటున్నామని కామెంట్ చేస్తున్నారు.
అయితే.. అటు ‘‘మీలో ఎవరు కోటీశ్వరులు’’ పరిస్థితి కూడా అనుకున్నంతగా లేదని టాక్. కర్టన్ రైజర్ షోకు రామ్ చారణ్ హాజరు కావడంతో.. రేటింగ్ 11 వరకు వచ్చింది. కానీ.. ఆ తర్వాత జోరు వేగంగా తగ్గుతూ వచ్చింది. తొలి వారంలో టీఆర్పీ రేటింగ్ 4 వరకు పడిపోవడం గమనార్హం. దీంతో.. నిర్వాహకులు షాకు గురవుతున్నట్టు సమాచారం. జూనియర్ తన వరకు చేయాల్సింది చేస్తున్నప్పటికీ.. రేటింగ్ మాత్రం ఆశించినంతగా రావట్లేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో.. జూనియర్ కు, నాగార్జునకు సవాల్ వచ్చి పడింది. అటు మీలో ఎవరు కోటీశ్వరులు కానీ.. ఇటు బిగ్ బాస్ కానీ.. వీరిద్దరే పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి.. తమదైన టాలెంట్ ను బయటకు తీసి ఈ రెండు షోలను వీరిద్దరూ సక్సెస్ ఫుల్ గా రన్ చేయాల్సి ఉంది. మరి, మొదట్లోనే ఈ తరహా కామెంట్లు వస్తున్న నేపథ్యంలో చివరకు ఈ రెండు షోలు ఎలా కొనసాగుతాయో చూడాలి.