
ఉపాధి హామీ బిల్లులపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. ఈనెల 15లోపు చెల్లింపులు జరగకపోతే ధిక్కార చర్యలు చేపడతామంది. 2 వారాల క్రితం 494 కేసుల్లో చెల్లింపులు చేయాలని తాము ఆదేశించామని.. 25 కేసుల్లోనే ప్రభుత్వం చెల్లింపులు చేయడంపై కోర్టు మండిపడింది. సర్పంచ్ ఖాతాలో డబ్బులు జమ చేస్తే గుత్తేదారుకు చెల్లించట్లేదని ప్రభుత్వం చెప్పగా.. వివరాలు ఇస్తే.. ధిక్కార చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది.