Guntur Karam and Devara : శివరాత్రి సందర్భంగా ప్రతీ ఏడాది మన స్టార్ హీరోలకు సంబంధించిన స్పెషల్ షోస్ ని అర్థ రాత్రి ప్రదర్శించడం దశాబ్దాల నుండి ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసింది. శివారాధన చేస్తూ జాగరణ చేస్తున్న సమయంలో ప్రేక్షకులు కోరుకునే కాలక్షేపాన్ని క్యాష్ చేసుకోవడానికి బయ్యర్లు ఇలాంటివి చేస్తుంటారు. ఈ శివరాత్రికి కూడా భారీగానే రాష్ట్ర వ్యాప్తంగా మిడ్ నైట్ షోస్ ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే దేవర(Devara Movie) , గుంటూరు కారం(Gunturu Karam), రెబెల్ వంటి సినిమాలను షెడ్యూల్ చేశారు. అదే విధంగా నాగ చైతన్య(Akkineni Nagachaitanya) ‘తండేల్'(Thandel Movie), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రాలను కూడా పలు చోట్ల మిడ్ నైట్ షోస్ లాగా ప్రదర్శిస్తున్నారు. అయితే వీటిల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ‘గుంటూరు కారం’ డామినేషన్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ‘గుంటూరు కారం’ చిత్రానికి దరిదాపుల్లో మరో సినిమా లేదు.
రేపు రాత్రి 11 గంటల 55 నిమిషాలకు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ లో ‘గుంటూరు కారం’ షోని షెడ్యూల్ చేయగా, టికెట్స్ హాట్ కేక్స్ లాగా నిమిషాల వ్యవధి లో సేల్ అయ్యాయి. ఈ థియేటర్ పక్కనే ఉన్నటువంటి దేవి థియేటర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర’ చిత్రాన్ని అదే టైం లో షో ని షెడ్యూల్ చేసారు. ఈ సినిమాకి కనీసం ఇప్పటి వరకు 50 టికెట్స్ కూడా అమ్ముడుపోలేదు. ‘దేవర’ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. కానీ ‘గుంటూరు కారం’ చిత్రం మాత్రం మహేష్ బాబు కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ స్పెషల్ షోస్ లో మాత్రం ‘గుంటూరు కారం’ చిత్రం ‘దేవర’ ని డామినేట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత అత్యధిక ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకున్న చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రెబల్’. ప్రభాస్ కెరీర్ లో అట్టర్ ఫ్లాప్ గా పిలవబడే ఈ సినిమాని ప్రతీ శివ రాత్రికి ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రతీసారి ఈ సినిమాకి డీసెంట్ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా ఎన్టీఆర్ దేవర ని డామినేట్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం. జూనియర్ ఎన్టీఆర్ కి తెలంగాణ లో పెద్దగా ఫ్యాన్స్ ఉండరని, ఆయనకంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారని, అందుకు నిదర్శనం ‘దేవర’ కి జరుగుతున్న బుకింగ్స్ అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ దురాభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక కొత్త సినిమాలకు సంబంధించిన శివరాత్రి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుతానికి వీక్ గానే ఉన్నాయి కానీ, అవి షో టైం కి ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.