Dragon : ఎదో ఒక సమయంలో బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయని పెద్దలు చెప్పిన సామెతలకు ఉదాహరణలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల కాలం లో అయితే ఇలాంటి ఉదాహరణలు చాలా ఎక్కువ అయిపోయాయి. తమిళ నాడు సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth), తల అజిత్(Thala Ajith) లాంటి స్టార్ హీరోలను చిన్న హీరో డామినేట్ చేస్తాడని మీరు ఎప్పుడైనా ఊహించారా?, కనీసం కలలో అయినా ఇలా జరుగుతుందని అనుకున్నారా?, కానీ జరిగింది. రీసెంట్ గా విడుదలైన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘డ్రాగన్’ (Dragon Movie) చిత్రం అందుకు ఉదాహరణ. డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసిన ప్రదీప్ రంగనాథన్, ‘లవ్ టుడే’ చిత్రం తో హీరో గా మారాడు. ఈ సినిమా అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ సినిమా తర్వాత ఆయన హీరో గా నటించిన ‘డ్రాగన్’ చిత్రం మూడు రోజుల క్రితం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమాకి వస్తున్న బాక్స్ ఆఫీస్ వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు కూడా మతి పోతుంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది సాధారణమైన విషయం కాదు. తల అజిత్ లేటెస్ట్ చిత్రం ‘విడాముయార్చి’ చిత్రానికి క్లోజింగ్ లో 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘డ్రాగన్’ చిత్రం ఫుల్ రన్ లో ఆ సినిమాని భారీ మార్జిన్ తో అధిగమించే అవకాశాలు ఉన్నాయి. నాల్గవ రోజు ఈ చిత్రానికి 7 కోట్ల రూపాయిల గ్రాస్ తెలుగు, తమిళ వెర్షన్స్ కి కలిపి వచ్చిందట. ఫ్లో చూస్తుంటే ఈ వారం లోనే 100 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకునేలా అనిపిస్తుంది.
ఓవరాల్ గా నాలుగు రోజులకు గాను ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు లో 28 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల రూపాయిలు, కర్ణాటక 3 కోట్ల 80 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి రూపాయిలు, ఓవర్సీస్ లో 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఊపు చూస్తుంటే కేవలం తమిళనాడు ప్రాంతం నుండే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునేలా ఉంది. అజిత్ ‘విడాముయార్చి’, రజినీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రాలకు కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు. ప్రదీప్ రంగనాథన్ రెండు సినిమాలు భారీ హిట్ అవ్వడంతో తమిళనాడు యూత్ లో ఈయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఈయన ఏ రేంజ్ కి వేళ్తాడో చూడాలి.