NTR And Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా వెలుగొందుతున్న చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చే పోటీని సైతం తట్టుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో వీళ్ళు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. అలాంటి నటులు 70 సంవత్సరాల వయసులో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతూ మంచి పాత్రలు ఎంచుకొని ముందుకు సాగుతున్నారు.వీళ్ళు చేసే సినిమాలకు ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ దక్కుతుందటంటే వాళ్ళకి ఎలాంటి క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… వాళ్లతో పాటు ఇప్పుడున్న స్టార్ హీరోలందరు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు.
ఇక హీరోలందరు బాగున్నప్పటికి వాళ్ల అభిమానుల మధ్య మాత్రం ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక ఏ హీరోకి అభిమానులు ఎక్కువగా ఉన్నారు అనే విషయం పక్కన పెడితే, ఒక ఈవెంట్ కి ఎక్కువమంది జనాలు వచ్చి సందడి చేసిన సందర్భం ఏదైనా ఉందా అంటూ సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో జరిగిన అన్ని ఈవెంట్స్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఆంధ్రావాలా’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి చాలా ఎక్కువ మంది జనాలు హాజరయ్యారు.
ఈ సినిమా ఆడియో రిలీజ్ కి దాదాపు 10 లక్షల మంది జనాలు వచ్చారు. నిమ్మకూరులో నిర్వహించిన ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. సింహాద్రి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఎన్టీఆర్ క్రేజ్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. మాస్ లో తనను బీట్ చేసే హీరో మరొకరు లేరు అనేంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇక అదే సమయంలో ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి ఇంతమంది జనాలు రావడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. మొత్తానికైతే ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో ఆ రోజుల్లోనే ప్రేక్షకులందరికి తెలిసేలా చేసింది. ఇక ఇప్పటివరకు ఆ రేంజ్ లో అంతమంది జనాల మధ్య ఒక్క సినిమా ఈవెంట్ కూడా జరగలేదు. ఒకరకంగా ఈ ఘనత ఎన్టీఆర్ కి మాత్రమే దక్కిందని తన అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు..