Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభమై రెండో వారం కూడా ముగియడానికి వస్తోంది. రెండు వారం అనగా ఆదివారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. నాగార్జున వచ్చి వారెవరో తేల్చేయనున్నాడు. గతవారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఈసారి ఎవరు అవుతారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 16 మంది ఉన్న హౌస్ లో.. 11 మంది నామినేట్ అయ్యారు.

ఇదిలా ఉండగా హౌస్ లోకి వచ్చిన ఓ యంగ్ హీరోని అరీయాన గ్లోరి దారుణంగా అవమానించింది. ఎవరైనా హీరోలు తమ సినిమా విడుదల ఉంటే ప్రమోట్ చేసుకోవడానికి బిగ్ బాస్ కు రావడం చాలా కామన్. వారి సినిమాలకు మరింత బజ్ తీసుకోవడానికి బిగ్ బాస్ ను ఉపయోగించుకుంటారు.
Also Read: మహేష్ – రాజమౌళి’ సినిమా ఎక్స్ క్లూజివ్ డిటైల్స్
అయితే ఇప్పుడు యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా తన కొత్త మూవీ స్టాండ్ అప్ రాహుల్ ను ప్రమోట్ చేసుకోవడానికి బిగ్ బాస్ కు వచ్చాడు. ఆయన సరసన నటించిన వర్ష బొల్లమ్మ కూడా ఇందులోకి వచ్చింది. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో బిగ్ బాస్ లో కొన్ని టాస్క్ లు చేశారు. స్టాండప్ కామెడీ, సింగిల్ వ్యక్తి ముందు లవర్స్ రొమాన్స్ చేసుకోవడం, లవర్స్ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడం లాంటి టాస్క్ లను అషు రెడ్డి, ఆరియాన లాంటి వారు చేసి చూపించారు.
అయితే హీరో రాజ్ తరుణ్ కు అరియానకు గతంలో పరిచయం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రాజ్ తరుణ్ వస్తున్నాడనే ఈ విషయం తెలియగానే ఆరీయాన తెగ సిగ్గు పడిపోవడం ఇందులో చూడొచ్చు. హౌస్ లో ఉన్న వారు ఆమెను ఆటపట్టించడం కూడా జరిగింది. ఇదిలా జరుగుతుండగానే రాజ్ తరుణ్ హౌస్ లోకి వచ్చాడు.

హౌస్ లోకి వచ్చిన రాజ్ తరుణ్.. తనకు ఉన్న పాత పరిచయాలను పక్కనపెట్టి.. తన సినిమా ప్రమోషన్స్ మాత్రమే మాట్లాడుతున్నాడు. దీంతో అరియాన కలగజేసుకుని ఏంటి బలిసిందా.. మర్చిపోయావా అంటూ దారుణమైన కామెంట్ చేసింది. హాయ్ చెప్పట్లేదు ఏంటి అని ప్రశ్నించింది. అదేంటి చెప్పాను కదా వస్తూనే హాయ్ చెప్పాను అంటూ రాజ్ తరుణ్ బదులిచ్చాడు. అయితే ఇదంతా బిగ్ బాస్ స్క్రిప్టు ప్రకారమే జరిగిందా.. లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రోమొలో మాత్రం ఇది ఉంది మరి ఫుల్ ఎపిసోడ్ వస్తే దీనిపై క్లారిటీ వస్తుంది.
Also Read: హీరో లక్ రివర్స్ అయ్యింది.. ఇక సైడ్ క్యారెక్టర్సే దిక్కు !