Bellamkonda Sai Sreenivas: యాక్షన్ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శ్రీను, జయ జానకి నాయక చిత్రాలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. అయితే అది కొనసాగించడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. వరుస పరాజయాలతో రేసులో వెనకబడ్డాడు. ఈ క్రమంలో ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన వచ్చిన బ్లాక్ బస్టర్ ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలన్న ఆయన నిర్ణయం, ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు కారణం లేకపోలేదు. యూట్యూబ్ లో బెల్లంకొండ హిందీ డబ్బింగ్ చిత్రాలకు భారీ ఆదరణ ఉంది. నార్త్ ఆడియన్స్ వాటిని విపరీతంగా చూస్తారు. ఈ పరిణామం బెల్లంకొండ లో విశ్వాసం నింపింది.
Also Read: మహేష్ బాబు సినిమాల్లో ఎన్టీఆర్ కి అసలు నచ్చిన సినిమాలు ఇవేనా..?
వివి వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి విడుదల చేశారు. బెల్లంకొండ అంచనాలు తలకిందులు అయ్యాయి. కనీస ఆదరణ ఆ చిత్రానికి రాలేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఛత్రపతి నిలిచింది. పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్ లో జయంతి లాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఛత్రపతి ఫెయిల్యూర్ పై తాజాగా బెల్లంకొండ స్పందించారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
బెల్లంకొండ మాట్లాడుతూ… హిందీలో సినిమాలు చేసిన సౌత్ హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. రానా, రామ్ చరణ్ హిందీ చిత్రాలు చేశారు. హిందీ మూవీ జంజీర్ ని మరలా హిందీలో రీమేక్ చేయడం వలన ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదేమో అనిపించింది. ఛత్రపతి సౌత్ మూవీ. రాజమౌళి తెరకెక్కించిన హిట్ సినిమా. ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయని భావించాము. హిందీలో సవతి తల్లి, బిడ్డ సెంటిమెంట్ కూడా కొత్త అని నిర్మాత నన్ను కన్విన్స్ చేశాడు. కానీ అప్పటికే నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలను చూసేశారు. వర్క్ అవుట్ అవుతుందా లేదా అనే టెన్షన్ వలన నేను కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు, అన్నారు.
ప్రస్తుతం ఆయన నటించిన భైరవం మూవీ మే 30న విడుదల కానుంది. నారా రోహిత్, మంచు మనోజ్ సైతం కీలక రోల్స్ చేశారు. భైరవం విజయం పై బెల్లంకొండ చాలా ఆశలే పెట్టుకున్నాడు. బెల్లంకొండ హీరోగా మరో మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. టైసన్ నాయుడు, హైందవం, కిష్కిందపురి టైటిల్ తో తెరకెక్కుతున్నాయి.