NTR
NTR : దుందిరాజ్ గోవింద్ పాల్కే అలియాస్ దాదాసాహెబ్ పాల్కే ఇండియన్ సినిమా పితామహుడు. ఇండియాకు సినిమాను తీసుకొచ్చిన ఘనత ఆయనదే. మన దేశంలో సినిమాను అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. విదేశాలకు వెళ్లి సినిమా అంటే ఏమిటో తెలుసుకుని, ఆ సాంకేతికత ఇక్కడకు తెచ్చారు. భారతీయులకు సిల్వర్ స్క్రీన్ అనుభూతిని పరిచయం చేసేందుకు ఆయన అనేక వ్యయప్రయాసలకు ఓర్చారు. నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా సేవలు అందించారు. ఆయన కృషి ఫలితంగా 1913లో హరిశ్చంద్ర టైటిల్ తో మొదటి సినిమా తెరకెక్కింది.
73 ఏళ్ల దాదా సాహెబ్ పాల్కే 1944లో కన్నుమూశాడు. ఆయన జీవితం ఆధారంగా సినిమా తీయాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. నితిన్ కక్కర్ దర్శకత్వంలో రాజమౌళి నిర్మాతగా దాదాసాహెబ్ పాల్కే చిత్రాన్ని గతంలో ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై కథనాలు వెలువడుతున్నాయి. దాదాసాహెబ్ పాల్కే పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
Also Read : రామ్ చరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే!
ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ వార్ 2 ఆగస్టు లో విడుదల కానుందని సమాచారం. ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ మూవీ వార్ 2 కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం డ్రాగన్. డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుంది. శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని ప్రచారం జరిగింది.
వచ్చే ఏడాది డ్రాగన్ మూవీ థియేటర్స్ లోకి రానుంది. ఇటీవల ఎన్టీఆర్ లండన్ పర్యటనకు వెళ్లారు. రాయల్ అల్బర్ట్ హాల్ లో జరిగిన ఆర్ ఆర్ ఆర్ కాన్సర్ట్ కి హాజరయ్యారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఉపాసన, లక్ష్మి ప్రణతి సైతం లండన్ వెళ్లారు. కార్యక్రమం ముగిశాక, రాజమౌళిని ఉపాసన ఆర్ ఆర్ ఆర్ 2 ఉంటుందా? అని అడిగింది. దానికి రాజమౌళి అవును అని సమాధానంచెప్పాడు . కాబట్టి ఆర్ ఆర్ ఆర్ 2 సైతం ఎన్టీఆర్ అప్ కమింగ్ చిత్రాల జాబితాలో ఉంది.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్ లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి..? దాని ధర ఎంతో తెలుసా!
Web Title: Ntr biopic bollywood hot topic