NTR Anil Ravipudi Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా అయితే రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ‘సుప్రీమ్’ సినిమా సక్సెస్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి కథ చెప్పాలని వెళ్ళాడు. అయితే ఎన్టీఆర్ కి అతను చెప్పిన కథ అంత పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. దాంతో మరో కథతో వస్తానని చెప్పారట. మరో కొత్త చెప్పినప్పటికి ఎన్టీఆర్ బాబి డైరెక్షన్లో జై లవకుశ సినిమాకి కమిట్ అవ్వడం వల్ల అనిల్ రావిపూడి తో సినిమా చేయలేకపోయాను అని పలు సందర్భాల్లో చెప్పాడు. అనిల్ రావిపూడి ఎన్టీఆర్ మూవీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నాడు. ఇక అభిమానులు సైతం వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా పడితే చూడాలని కోరుకుంటున్నారు… నిజానికి అనిల్ రావిపూడి అప్పుడే రాంగ్ స్టెప్ వేశాడని చెప్పాలి. ఎన్టీఆర్ చేత కామెడీని చేయించడం కంటే కూడా అతని చేత భారీ మాస్ అప్పీరెన్స్ చేయించే కథ చెబితే బాగుండేది.
అలాగే అతనికి తగ్గట్టు కథను కూడా రాసుకుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండేది అవి లేకపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అనిల్ రావిపూడి కథను రిజెక్ట్ చేశాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటేనే మాస్ ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతారు. కాబట్టి ఆ ఎలిమెంట్స్ ని ఎక్కువగా ఆడ్ చేసుకుంటే సినిమా చూసేవాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు…
అతను అభిమానులు కూడా ఎంజాయ్ చేసేవారు. ఫ్యూచర్లో ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడా? అతని స్వాగ్ ను అందుకోగలిగే కథని రెడీ చేయగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
మొత్తానికైతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక అనిల్ సైతం ప్రస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…
