రాజమౌళి సినిమా అంటేనే కొన్ని సంవత్సరాలు కేటాయించాలి. అంతకుమించి డబ్బు, వ్యయం వస్తూనే ఉంటాయి. సినిమాలను ఒక గోడకట్టినట్టు పద్ధతిగా రాజమౌళి తీస్తుంటాడు. అందుకే బాహుబలి ఐదేళ్లు కాగా.. ‘ఆర్ఆర్ఆర్’ రెండేళ్లుగా చెక్కుతూనే ఉన్నాడు.
నటీనటులను బాగా కష్టపెడుతూ తను అనుకున్న 100శాతం వచ్చే వరకు రాజమౌళి వదిలిపెట్టడు. ఈ విషయాన్ని ఆయనతో నటించిన యాక్టర్లు చెబుతుంటారు.
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టైంలో రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నటీనటులను హింసించడమే కాదు.. చిత్రం షూటింగ్ గ్యాప్ లో వారితో సరదాగా రాజమౌళి గడుపుతాడు అని అర్థమైంది.
ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ షూటింగ్ స్పాట్లో సరదాగా గడిపారు. రాజమౌళి, ఎన్టీఆర్ , రాంచరణ్ సహా కొందరు వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. దీన్ని అక్కడే ఉన్న ఎవరో సీక్రెట్ గా రికార్డ్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీళ్ల ఫ్యాన్స్ మాత్రం తెగ షేర్ చేస్తూ ఖుషి అవుతున్నారు.