Ntr And Puri Jagannadh: నందమూరి ఫ్యామిలీ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)…ఈయన కెరియర్ మొదటి నుంచే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆది (Aadi) సినిమా తర్వాత చేసిన సింహాద్రి (Simhadri) సినిమాతో ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం… ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీద ఆయన భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఆ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి… ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ టెంపర్(Temper) మూవీ తర్వాత పూరి జగన్నాథ్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా వర్కౌట్ కాలేదు.
విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ చేసిన ‘లైగర్’ (Liger) సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ కి ఆ కథ అంత పెద్దగా నచ్చకపోవడంతో ఇందులో కొన్ని మార్పులు చేయమని కోరాడట. దాంతో పూరి జగన్నాథ్ ఎలాంటి మార్పులు చేయడానికి ఇష్టపడలేదు. అందుకే ఎన్టీఆర్ ప్లేస్ లో విజయ్ దేవరకొండని పెట్టి లైగర్ అనే సినిమా చేశాడు.
ఆ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ని హీరోగా పెట్టి బెగ్గర్ (Beggar) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో దేశంలో నలుగుమూలల ఉన్న స్టార్ ఆర్టిస్టులందరిని భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా పూరి జగన్నాథ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి జూనియర్ ఎన్టీఆర్ తో మరొక సినిమా చేస్తే చూడాలని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు పూరి జగన్నాథ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఎన్టీఆర్ తో మరోసారి సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…