Baahubali The Epic collections: రీ రిలీజ్ హిస్టరీ లోనే ఎవ్వరూ అందుకోలేనంత రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతోంది ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali : The Epic). తెలుగు సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కూడా ప్రభంజనం సృష్టించింది. ఒకప్పుడు ‘నాన్ బాహుబలి రికార్డు’ అనే క్యాటగిరీ చాలా సంవత్సరాల వరకు కొనసాగేది. ఇప్పుడు కూడా రీ రిలీజ్ లో ‘నాన్ బాహుబలి రికార్డు’ క్యాటగిరీ వచ్చేసింది. సాధారణంగా ఈమధ్య కాలం లో రీ రిలీజ్ అవుతున్న సినిమాలు కేవలం మొదటి రోజు ఒక్కటే భారీ వసూళ్లను రాబడుతున్నాయి. రెండవ రోజు నుండి కలెక్షన్స్ ని రాబట్టలేకపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ మాత్రమే ఇప్పటి వరకు లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న చిత్రం. ఈ రికార్డు శాశ్వతంగా ఉండిపోతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు బాహుబలి కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తుంది.
విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం లో 8 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతం లో కోటి 90 లక్షలు, ఆంధ్రా ప్రాంతం లో 6 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి 17 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ర్బాట్టింది. అందులో కర్ణాటక నుండి 3 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తమిళ నాడు + కేరళ కు కలిపి 2 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అదే విధంగా హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 5 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ నుండి ఏకంగా 11 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన సినిమా గా నిల్చింది ఈ చిత్రం. రాబోయే రోజుల్లో కూడా పెద్ద సినిమాలు విడుదల లేవు కాబట్టి, కచ్చితంగా ఈ చిత్రం మరింత లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటుందని, 60 నుండి 70 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా మంచి లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటే ఫుల్ రన్ లో వంద కోట్ల గ్రాస్ ని అందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.