NTR And Prashanth Neel: మన టాలీవుడ్ నుండి ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో అభిమానులతో పాటు, మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్(Dragon Movie) (వర్కింగ్ టైటిల్) చిత్రం. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ మీద రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ‘దేవర’ చిత్రం లాగానే ఇది కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ షిప్ సెట్స్ ని ఏర్పాటు చేసి అక్కడ ఎన్టీఆర్ మరియు ఇతర తారాగణం ప కొన్ని కీలక సన్నివేశలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్స్ ని చూస్తుంటే పాత కాలపు వింటేజ్ ఫీలింగ్ కలుగుతుందని సెట్స్ ని సందర్శించిన వాళ్ళు చెప్తున్నారు.
ఎన్టీఆర్ ఈ చిత్రం లో ఇప్పటి వరకు అభిమానులు ఎప్పుడూ చూడని మాస్ యాంగిల్ లో కనిపించబోతున్నాడట. మీసాలు కూడా రాని వయస్సులో ఎన్టీఆర్ కనీవినీ ఎరుగని రేంజ్ మాస్ రోల్స్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. చిన్న వయస్సులోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా మారడానికి కారణం ఆయన వేసిన మాస్ రోల్స్. అలాంటి మాస్ రోల్స్ ని మరపించే మాస్ రోల్ అంటే ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ క్యారక్టర్ ని ఎలా డిజైన్ చేస్తున్నాడో ఊహించుకోవచ్చు. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోలను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేజీఎఫ్, సలార్ చిత్రాలు అందుకు ఉదాహరణ. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి పెద్ద వీరాభిమాని, ఒక అభిమాని తన అభిమాన హీరోని తన విజన్ కి తగ్గట్టు ఎలివేషన్ సన్నివేశాలు రాస్తే ఆ సినిమాలు ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిల్చాయో గతంలో మనం చూసాము.
ఈసారి కూడా అలాంటి హిస్టరీ రిపీట్ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం ఆయన కీలక పాత్ర పోషించిన ‘వార్ 2’ చిత్రం ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఈ ఏడాది లోనే ఎన్టీఆర్ నీల్ సినిమా విడుదల అవుతుందని అంతా అనుకున్నారు కానీ, వచ్చే ఏడాది జూన్ నెల వరకు విడుదల అవ్వదని రీసెంట్ గానే అధికారికంగా తెలిసింది. ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఉంటుందట. నార్త్ ఇండియన్ మార్కెట్ లో కూడా ఎన్టీఆర్ శాశ్వతంగా తన ముద్ర వేసుకునేలా ఈ చిత్రాన్ని తీర్చి సిద్ధేందుకు ప్రశాంత్ నీల్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడట. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.