Rajinikanth And NTR: కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయితే చూడాలని అభిమానులు చాలా ఆశగా కోరుకుంటూ ఉంటారు. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కాంబినేషన్. వీళ్లిద్దరు కలిసి కేవలం ఒకే ఒక్కసారి స్టేజి మీద కనిపించారు. పునీత్ రాజ్ కుమార్ కి కన్నడ రత్న అవార్డుని ప్రకటించినప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఆ ఈవెంట్ లో పాల్గొన్నారు. వీళ్ళు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియా లో రాగానే సెన్సేషనల్ గా మారింది. రెండు మూడు రోజుల వరకు కూడా దీని గురించి చర్చలు జరుపుకున్నారు. అలాంటి సమయంలోనే అభిమానులు ఈమధ్య కాలంలో చాలా క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అదేదో రజనీకాంత్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక్క మూవీ సెట్ అయితే బాగుంటుంది కదా అని అభిమానులు కోరుకున్నారు. భవిష్యత్తులో ఇది జరగొచ్చు,జరగకపోవచ్చు కానీ, గతం లో వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ దాకా వచ్చి ఆగిపోయింది అట.
ఆ సినిమా మరేదో కాదు, ‘జనతా గ్యారేజ్’. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి భారీ కమర్షియల్ హిట్స్ తర్వాత ఎన్టీఆర్ తో కొరటాల శివ చేసిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర కు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో, మోహన్ లాల్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు మోహన్ లాల్ పాత్ర ఎన్టీఆర్ పాత్ర ని డామినేట్ చేస్తుంది. అప్పట్లో ఈ అంశం సోషల్ మీడియా లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ క్యారక్టర్ ని ముందుగా బాలయ్య తో చేద్దామని అనుకున్నారు. ఎన్టీఆర్, బాలయ్య కాంబినేషన్ అంటే చాలా క్రేజీ గా ఉంటుంది, కానీ బాలయ్య క్యారక్టర్ కి కూడా ఎన్టీఆర్ తో సరిసమానంగా సినిమా మొత్తం బ్యాలన్స్ చేయాల్సి వస్తుంది, అలా చేస్తే కథ చెడిపోతుంది అనే ఉద్దేశ్యంతో మోహన్ లాల్ ని తీసుకున్నారు.
మోహన్ లాల్ కి ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ ని కూడా సంప్రదించే ఆలోచనలో ఉండేవాడట డైరెక్టర్ కొరటాల శివ. ఎందుకంటే రజనీకాంత్ ఎలాగో మన తెలుగు హీరో కాదు కాబట్టి,గతం లో ఆయన ‘పెద్దరాయుడు’ వంటి స్పెషల్ రోల్ క్యారెక్టర్స్ చేసాడు కాబట్టి ఆయన అయితే వేరే లెవెల్ లో ఉంటుందని అనుకున్నాడట. కానీ ఎన్టీఆర్ మోహన్ లాల్ పేరు ని చెప్పడం తో కొరటాల శివ తన మనసులో ఉన్న ఆలోచనలను పక్కన పెట్టి , నేరుగా మోహన్ లాల్ ని కలిసి ఈ సినిమా స్టోరీ ని వినిపించాడట. ఆయనకు మొదటి సిట్టింగ్ లోనే ఈ సినిమా స్టోరీ తెగ నచ్చేసింది. వెంటనే డేట్స్ ఇచ్చి ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు. ఫలితం ఏంటో మనమంతా చూసాము. భవిష్యత్తులో అయినా ఎన్టీఆర్, రజనీకాంత్ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.