NTR- Koratala Siva Movie: కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య చిత్రం ఈ ఏడాది విడుదలై ఎంత పెద్ద భారీ డిజాస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..కొరటాల శివ దర్శకత్వం మీద కంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టడం వల్లే ఈ సినిమా ఔట్ ఫుట్ అలా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపించే మాట.. చిరంజీవి , రామ్ చరణ్ వంటి స్టార్స్ ని పెట్టుకొని ఇలాంటి సోది సినిమా తీస్తారా అని అభిమానుల నుండి కొరటాల శివ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు.

అంతే కాకుండా ఈ సినిమాకి కొరటాల శివ అనధికారిక నిర్మాత..నిరంజన్ రెడ్డి నుండి 80 కోట్ల రూపాయలకు సినిమాని కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూటర్స్ కి 130 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు..సినిమాకి అట్టర్ ఫ్లాప్ టాక్ రావడం తో క్లోసింగ్ కలెక్షన్స్ 50 కోట్ల రూపాయలకే పరిమితమైంది.. దీంతో బయ్యర్స్ కి సుమారు 80 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది.
ఈ సినిమాకి వచ్చిన నష్టాల ప్రభావం త్వరలో ఆయన చేయబోతున్న ఎన్టీఆర్ సినిమా మీద కూడా పడింది..కొరటాల శివ ఇప్పటికి కూడా కొంతమంది బయ్యర్స్ కి డబ్బులు జామచెయ్యలేదు..దీంతో ఈయన సినిమాకి ఫైనాన్స్ చెయ్యడానికి ఏ సంస్థ కూడా ముందుకు రావడం లేదట..ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో తో సినిమా అయినప్పటికీ కూడా కొరటాల శివ ని చూసి ఫైనాన్స్ చెయ్యడానికి భయపడుతున్నారట..అందుకే ఇప్పటి వరుకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాలేదని అంటున్నారు..ఇప్పుడు కొరటాల శివ ఓవర్సీస్ లో ఉన్న తన స్నేహితుల సహాయం తీసుకొని ఈ సినిమాకి ఫైనాన్స్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడట.

ఇలా అంతర్గతంగా ఇలాంటివి జరగడం వల్ల ఈ సినిమా ఆగిపోయింది అంటూ మొన్న ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది..ఇది నిర్మాతల దృష్టికి వెళ్లడం తో వాళ్ళు వెంటనే స్పందించి అతి త్వరలోనే ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ప్రారంభం అవుతుందని..పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయ్యిపోవస్తుందని చెప్పుకొచ్చారు..ఒక్క ఆచార్య సినిమా ఫలితం కొరటాల శివ జీవితాన్నే మార్చేసింది..మరి ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాతో తన సత్తా ని చాటి బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది చూడాలి.