NTR: జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న రెండవ షెడ్యూల్ ని మొదలు పెట్టారు. ఈ షెడ్యూల్ లో పాల్గొన్న ఎన్టీఆర్, నిన్నటి వరకు విరామం లేకుండా షూటింగ్ చేసాడు. ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో కాస్త బ్రేక్ దొరికింది. ఈ విరామం సమయం లో ఆయన తన కుటుంబం తో కలిసి సమ్మర్ ట్రిప్ కోసం విదేశాలకు పయనమయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనేక విధమైన కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో, భారత్ లో ఉండడం ప్రస్తుతానికి సురక్షితం కాదని, పరిస్థితులన్నీ సర్దుకునే వరకు సమ్మర్ ట్రిప్ కి వెళ్లడం మంచిదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: దాయాది క్షిపణులు ఔట్.. S-400 సిస్టమ్ ప్రత్యేకతలేంటి?
ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోలు ఏ పని చేసినా భూతద్దం లో చూడడం సర్వసాధారణమే. ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎంత మంది ఉంటారో, ద్వేషించే వాళ్ళు కూడా అంతే ఉంటారు, చిరంజీవి, బాలయ్య కాలం నుండే ఇలాంటివి చూస్తూ పెరిగాము. మాస్ హీరోలకు ఇలాంటి ట్రోల్స్ సర్వసాధారణం. ఎన్టీఆర్ క్యాజువల్ గానే తన కుటుంబం తో కలిసి విదేశాలకు వెళ్తున్నాడు అనేది వాస్తవం. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ రీసెంట్ గానే హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ అనే చిత్రం చేసాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేసాడనే విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ చిత్రం నుండి చిన్న అప్డేట్ కోసం అభిమానులు ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, లేదా టీజర్ విడుదల అవుతుందని ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సూచనలు పెద్దగా కనిపించడం లేదు. అసలు ఆగష్టు 14 న ఈ సినిమా వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి. ఎందుకంటే అదే రోజున సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ’ చిత్రం విడుదల కాబోతుంది. రెండు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాలు ఒకే రోజున విడుదల అవ్వడం అనేది అసాధ్యం కాబట్టి, ‘వార్ 2’ వెనక్కి వెళ్తుంది అనే టాక్ కూడా ఉంది. కనీసం ఈ స్పష్టత అయినా మే20 న వస్తుందో లేదో చూడాలి.
Young Tiger @tarak9999 at Airport with his Family pic.twitter.com/gCNCKdvJam
— greatandhra (@greatandhranews) May 9, 2025