A Tiger And A Bear Meet: Wild Lifeకు సంబంచించిన వీడియోలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఒకప్పుడు టీవీ నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఛానెళ్లలో వచ్చే జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూసేవారు. కానీ ఇప్పుడు చేతిలోకి మొబైల్ వచ్చాక ఎప్పడు కావాలంటే అప్పుడు కోరుకున్న వీడియోలు చూస్తున్నారు. ఈ క్రమంలో Animals కు చెందిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. దట్టమైన అడవుల్లో జంతు ప్రపంచం ఎలా ఉంటుందో కొందరు ప్రత్యేకంగా వెళ్లి వారీ జీవన విధానం గురించి వివరిస్తూ ఉంటారు. మరికొందరు Saffari Tours కు వెళ్లి అక్కడ జంతువులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటారు. తాజాగా రెండు జంతువులకు సంబంధించిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో రెండు విభిన్న జాతులకు చెందిన జంతువుల మధ్య జరిగిన సీన్ ఆకట్టుకునే విధంగా ఉంది. అది ఎలా ఉందంటే?
కొందరికి పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం చాలా ఇష్టం.వీరిలో కొందరు అందమైన ప్రదేశాలకు వెళ్తారు.. మరికొందరు అందమైన ప్రకృతిని ఆస్వాదించేందుకు వెళ్తారు. ఇంకొందరికి మాత్రం Saffari Tours కు వెళ్లడం ఇష్టం. జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్లి అవి ఏం చేస్తాయో ప్రత్యక్షంగా ఈ టూర్ ద్వారా తెలుసుకోవచ్చు. తాజాగా కొందరు Saffari Tours కు వెళ్లారు. వీరికి రెండు జంతువుల మధ్య జరిగినీ సీన్ కనిపించింది. దీనిని వెంటనే వీడియో తీశారు.
ఈ వీడియోలో ఒక పెద్దపులి (Tiger) దారి వెంబడి నడుచుకుంటూ వెళ్తోంది. ఒక చోట ఆగి అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. ఇంతలో కొంత దూరంలో చెట్ల పొదల్లో నుంచి ఒక ఎలుగుబంటి (Bear)బయటకు వస్తుంది. అయితే దీనిని చూడగానే టైగర్ భయపడిపోతుంది. దీంతో ఉన్నచోటే నక్కుతుంది. బీయర్ ఏం చేస్తుందో గమనిస్తూ ఉంటుంది. చాలా సేపు బీయర్ అటూ ఇటూ తిరుగి తిరిగి చెట్ల పొదల్లోకి వెళ్తుంది. అయితే అప్పటి వరకు నక్కిన పులి మెల్లగా లేసి ఎలుగుబండి బయటకు వచ్చిన ప్రదేశానికి వెళ్తుంది.
అయితే ఇంతలో చెట్ల పొదల్లో నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా బయటకు వస్తుంది. దీంతో పులి భయపడిపోతుంది. ఆ తరువాత అది పులిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ పులి మాత్రం ఎదురుదాడి దిగడానికి ప్రయత్నించదు. ఆ తరువాత చాలా సేపు వరకు రెండు జంతువులు ఒకే చోట ఉంటాయి. ఆ తరువాత ఎవరి దారి వారు చూసుకుంటాయి. అడవిలో దాదాపు భిన్న జాతుల జంతువులు ఎదురు అయినప్పుడు వాటి మధ్య ఆత్మ రక్షణ కోసం పోరాటం ఉంటుంది. అయితే పులి మాత్రం ఆహారం కోసం ఇతర జంతువుపై దాడి చేస్తుంది. కానీ ఎలుగుబంటిని చూసిన పులి దాడి చేయకపోగా.. ఎలుగుబంటికి బయపడడం చూసి అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోపై చాలా మంది ఆసక్తిగా కామెంట్ చేస్తున్నారు. భల్లూకు పులి భయపడడం ఏంటి? అని కొందరు అంటుండగా.. పులికి ఆకలిగా లేదు అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.