Pawan Kalyan health update: ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈమధ్య కాలంలో నిత్యం అనారోగ్యానికి గురి అవుతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈమధ్యనే ఆయన ముక్కుకి ఆపరేషన్ కూడా జరిగింది. అందుకు నెల రోజులు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ అయిన పవన్ కళ్యాణ్ , వరుసగా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటూ, పార్టీ మీటింగ్స్ ని కూడా నిర్వహిస్తూ ఫుల్ బిజీ అయ్యాడు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన మరోసారి తీవ్రమైన అవస్థతకు గురైనట్టు తెలుస్తోంది. నేడు సచివాలయం లో నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్ కి హాజరైన పవన్ కళ్యాణ్ , మధ్యలోనే లేచి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. కారణం ఆయనకు తీవ్రమైన వెన్నునొప్పి కలగడమే అని తెలుస్తోంది. క్యాబినెట్ సమావేశం నుండి వాకౌట్ అయిన ఆయన , నేరుగా మంగళగిరి కి వెళ్లినట్టు తెలుస్తోంది.
అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ అస్వస్థత తీవ్రత ఎంత వరకు ఉంది అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు , పవన్ కళ్యాణ్ కి వచ్చినది సాధారణమైన వెన్ను నొప్పి , ఆయనకు ఇది ఎప్పటి నుండో ఉన్న సమస్య అంటూ చెప్పుకొస్తున్నారు జనసేన పార్టీ సన్నిహితులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఇన్ని సార్లు అస్వస్థతకు గురవ్వడం గతంలో ఎప్పుడు జరగలేదు. పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి అనేక ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన పాదయాత్ర వంటివి చేయలేకపోయాడని , ఒకవేళ పాదయాత్ర చేసుంటే సోలో గానే సీఎం అయ్యేవాడని అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇన్ని ఆరోగ్య సమస్యల మధ్య పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా ఇప్పుడు అభిమానుల్లో కలుగుతున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.
