https://oktelugu.com/

Baahubali 2 and Pushpa 2 : బాహుబలి 2, పుష్ప 2 కాదు..70 కోట్లతో సినిమా తీస్తే ఏకంగా 2000 కోట్లను వసూలు చేసిన సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 19, 2024 / 12:05 PM IST

    Baahubali 2, Pushpa 2

    Follow us on

    Baahubali 2 and Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ అల్లుఅర్జున్ లాంటి నటులు తమదైన రీతిలో సత్తా చాటుకోడమే కాకుండా వాళ్ళకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు… ఇక అందులో భాగంగానే వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ హిట్టు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు…

    ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఆకర్షిస్తూ భారీ ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి ‘బాహుబలి 2’ సినిమాతో 1900 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ‘పుష్ప 2’ సినిమాతో అల్లు అర్జున్ ఆ రికార్డును బ్రేక్ చేసే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించి ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేస్తున్నాయి అంటూ చాలామంది చాలా వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలకు దాదాపు 500 నుంచి 600 కోట్ల వరకు బడ్జెట్ అయితే పెట్టారు. ఇక 600 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాలు 2000 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడంలో పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు… కానీ వీటికి మించి విజయం సాధించి 2000 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమా ఒకటి ఉందనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘దంగల్ ‘ సినిమా… ఈ మూవీ కేవలం 70 కోట్లతో తెరకెక్కి 2000 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది అంటే మామూలు విషయం కాదు.

    ఇక అది వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి ఎన్ని రేట్లు ప్రాఫిట్ ని తీసుకొచ్చిందో మీరే అర్థం చేసుకోండి. మరి ఇలాంటి సందర్భంలో ఇంత పెద్ద విజయాన్ని సాధించిన బాలీవుడ్ సైతం మరోసారి తన ప్రభంజనాన్ని సృష్టించలేకపోతుంది.

    కానీ ఇప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ లోనే ఉందని చెప్పాలి. మనవాళ్లు ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఆ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోతున్నారు. అయితే బాహుబలి 2, పుష్ప 2 సినిమాల కంటే దంగల్ సినిమానే ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిందని చాలా మంది భావిస్తున్నారు.

    ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కి అది కలెక్ట్ చేసిన కలెక్షన్స్ కి ఈ సినిమా వేరే లెవల్ అనే చెప్పాలి. ఇక ఏ సినిమా వచ్చి ఆ రికార్డును బ్రేక్ చేసిన కూడా అది అసలైన రికార్డు కాదు అంటూ ప్రేక్షకులు సైతం వాదిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రొడ్యూసర్ కి ఎక్కువ ప్రాఫిట్ ని తీసుకొచ్చిన సినిమాగా దంగల్ సినిమా చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పాలి…