https://oktelugu.com/

Pushpa 3 : పుష్ప 3 నుంచి లీకైన డైలాగ్..మామూలుగా లేదుగా..?వైల్డ్ ఫైర్ కంటే అరాచకంగా ఉందిగా….

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోయాయనే చెప్పాలి. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి తెలుగు సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతుందనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : December 19, 2024 / 11:55 AM IST

    Pushpa 3

    Follow us on

    Pushpa 3 : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోయాయనే చెప్పాలి. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి తెలుగు సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతుందనే చెప్పాలి. ఇప్పటివరకు మన హీరోలు సాధించిన విజయాలు ఒకతైతే సాధించబోయే విజయాలు మరొక ఎత్తు అనేంత రేంజ్ లో ముందుకు దూసుకెళ్తు ఉండటం విశేషం…

    తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ఇప్పుడు అందరికి ఎక్కువగా అల్లు అర్జున్ గుర్తుకు వస్తున్నాడు. కారణం ఏంటి అంటే పుష్ప 2 సినిమా కోసం ఆయన విపరీతమైన ప్రయత్నం చేయడమే కాకుండా ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపడంలో ఆయన పడిన కష్టం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 1600 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇంకా ముందుకు దూసుకెళ్తూ ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేయడానికి ఈ సినిమా సిద్ధంగా ఉంది అంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాను టచ్ చేసే రేంజ్ మరే సినిమాకు లేదనేంతల గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగిపోతుంది.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎండింగ్ లో పుష్ప 3 కూడా ఉండబోతుంది అంటూ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు దానికి సంబంధించిన ఒక డైలాగ్ కూడా సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే పుష్ప 3 సినిమాకు సంబంధించిన కొంత పార్ట్ షూట్ ని కూడా చేశారట. అయితే మిగతా షూట్ మొత్తాన్ని మరో రెండు సంవత్సరాల తర్వాత చేయాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఎందుకు అంటే అల్లు అర్జున్ కమిట్ అయిన సినిమాలు అలాగే సుకుమార్ కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసి ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు కొంత పార్టీ షూట్ చేశారు అయితే ఇప్పటివరకు షూట్ చేసిన దాంట్లో ఒక డైలాగ్ అనేది చాలా బాగుందని ఆ సినిమా నుంచి కొంతమంది టెక్నీషియన్ల ద్వారా ఒక డైలాగ్ అయితే బయటకు లీక్ అయింది. ఇక ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

    ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి అంటే పుష్పని చంపడానికి కొంతమంది బిహారీ రౌడీలు తన ఇంటి మీదికి వచ్చినప్పుడు పుష్ప వాళ్ళను కొట్టి ‘పుష్పని వేసేయ్యాలంటే ప్లాన్ ఒక్కటే ఉంటే సరిపోదబ్బా గుండెల్లో ధైర్యం కూడా ఉండాలి… ఎవడు పడితే వాడు వచ్చి పొడిస్తే పోవడానికి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్’ అంటూ పుష్ప డైలాగ్ చెప్తాడట… ఈ డైలాగు విన్న ప్రతి ఒక్క అల్లు అర్జున్ అభిమాని కూడా విజిల్స్ కొడుతున్నాడు. పుష్ప 3, పుష్ప 2 కంటే భారీ సక్సెస్ సాధిస్తుంది అంటూ ఆయన అభిమానులు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు…