కరోనా కారణంగా అన్ని సినీ పరిశ్రమలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులపాలైయాయి. ముఖ్యంగా సగం షూటింగ్ చేసుకున్న సినిమాల నిర్మాతలు బాగా నష్టపోయారు. అయినా హీరోలు హీరోయిన్లు తమకు సంబంధం లేదనట్టు ఎవరికీ వారు సైలెంట్ గా ఉండిపోయారు. ఇలాంటి టైంలోనే తనకు తానుగా తన రెమ్యూనరేషన్ లో 25 శాతం తగ్గించుకుంటున్నానని ఆ మధ్యే ప్రకటించాడు తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఆ తరువాత కోలివుడ్ దర్శకుడు హరి కూడా తన రెమ్యునరేషన్ లో 25 శాతం తగ్గించుకుంటున్నట్టు తెలిపాడు. అలాగే తమిళ చిత్ర పరిశ్రమకే చెందిన మరో యంగ్ హీరో హరీష్ కల్యాణ్ కూడా తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకుంటున్నానని మిగిలన తనలాంటి యంగ్ హీరోలకు, చిన్న హీరోలకు స్ఫూర్తిగా నిలిచాడు.
Also Read: బాపుబొమ్మకు వింత శబ్దాలు.. త్వరలోనే చెబుతుందట !
ఇదంతా బాగానే ఉంది. మరి తెలుగు సినీ పరిశ్రమ నుండి తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నానని ఇంతవరకూ ఒక్క హీరో కూడా ఎందుకు ముందుకు రాలేదు. పోనీ హీరోయిన్స్ అయినా ముందుకు వచ్చారా అంటే అదీ లేదు. కోట్లు తీసుకునే హీరోలు హీరోయిన్లు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే నిర్మాతలకు ఈ కష్ట కాలంలో గొప్పగా సపోర్ట్ చేసినట్టే కదా. కానీ, మన తెలుగు హీరోలుకు ఆ దిశగా అలోచిన చేసే ఆలోచన లేనట్లు ఉంది. అయితే హీరోయిన్ తాప్సీ కూడా తన రెమ్యునరేషన్‌ని తగ్గించుకున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ, ఆ వార్తల్లో కూడా నిజం లేదు. తాప్సి ప్రస్తుతం ఓ తమిళ సినిమా షూట్ లో పాల్గొనాలి. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతతో బెట్టు చేస్తోందట. గతంలో చెప్పినంతే ఇవ్వాలని.
Also Read: టాలీవుడ్ కు శాపం.. సంక్రాంతి కూడా పాయే..
సినిమా నిర్మాతలతో పాటు తాము నమ్ముకున్న సినీ కళామతల్లి క్షేమం కోరి.. తమిళ పరిశ్రమకు చెందిన వారు రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటునప్పుడు మన వాళ్ళు కూడా ఆ దిశగా మొదటి అడుగు వేసి నిర్మాతలకు ఊరట కలిగిస్తే బాగుంటుంది. ఎలాగూ సినీ పరిశ్రమ ఆర్థికంగా కోలుకుని తిరిగి మామూలు స్థితికి రావటానికి మరో ఐదారు ఏళ్ళు పడుతుందనేది సినీ విశ్లేషకులు అభిప్రాయం. మరి ఈ నేపథ్యంలో హీరోహీరోయిన్లు, దర్శకులు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. అప్పుడే సినిమా నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి. నిర్మాతలు బాగుంటారు. ఎక్కువ సినిమాలు తీస్తారు. అప్పుడు సినీ రంగం నమ్ముకున్న కార్మికులు కూడా బతికి బట్టకట్టే అవకాశం ఉంటుంది.