https://oktelugu.com/

‘రష్మికా మండన్న’ వల్ల వారికి అసంతృప్తి !

రష్మికా మండన్న… అందాల తార‌. న‌ట‌న‌లో కృత్రిమ‌త్వం కాస్త క‌నిపించినా.. ఆమెకు వచ్చిన సక్సెస్ ల పరంపరతో ఆల్ రెడీ మహేష్ తో నటించేసింది. సరిలేరు నీకెవ్వరులో త‌న క్యూట్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు సుల‌భంగా నటించి బాగానే ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది ఈ యంగ్ బ్యూటీ. కాగా ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ల‌ పై త‌న అభిప్రాయాల‌ను మేకర్స్ కు నిర్మొహ‌మాటంగా చెబుతుందట. కరోనా కార‌ణంగా ఆరు నెల‌లుగా షూటింగ్‌లు నిలిచిపోయాయి. నిజమే.. అయితే లాక్‌ డౌన్ స‌డ‌లింపుల […]

Written By:
  • admin
  • , Updated On : September 23, 2020 / 03:22 PM IST
    Follow us on


    రష్మికా మండన్న… అందాల తార‌. న‌ట‌న‌లో కృత్రిమ‌త్వం కాస్త క‌నిపించినా.. ఆమెకు వచ్చిన సక్సెస్ ల పరంపరతో ఆల్ రెడీ మహేష్ తో నటించేసింది. సరిలేరు నీకెవ్వరులో త‌న క్యూట్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు సుల‌భంగా నటించి బాగానే ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది ఈ యంగ్ బ్యూటీ. కాగా ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ల‌ పై త‌న అభిప్రాయాల‌ను మేకర్స్ కు నిర్మొహ‌మాటంగా చెబుతుందట. కరోనా కార‌ణంగా ఆరు నెల‌లుగా షూటింగ్‌లు నిలిచిపోయాయి. నిజమే.. అయితే లాక్‌ డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో తిరిగి షూటింగ్‌ లు స్టార్ట్ చేస్తున్న నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆమె నిర్మాతలను కోరుకుతుందట.

    Also Read: టాలీవుడ్ కు శాపం.. సంక్రాంతి కూడా పాయే..

    ప్రస్తుతం ఓ కన్నడ చిత్రంలో నటిస్తున్న రష్మిక… త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఆ సినిమా షూటింగ్ విష‌య‌మై నిర్మాతకు ఎక్కువ షరతులే పెట్టిందట. సెట్స్‌ లోకి తిరిగి అడుగుపెట్టాలంటే తనకు భయంగా ఉందని.. ప్రొడక్షన్‌ టీమ్‌ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటుందో తనకు సరిగ్గా అవగాహన లేదని.. పైగా షూటింగ్ స‌మ‌యంలో సెట్‌ లో చాలా మంది ఉంటారు కాబాట్టి.. ఎవరో ఒక్కరికి వ్యాధి వచ్చినా మిగతావారు మొత్తం ప్రమాదంలో పడతారు, అందుకే తానూ షూట్ లో పాల్గొనాలంటే తప్పకుండా జాగ్రత్తకు సంబందించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆ కన్నడ నిర్మాతకు రష్మిక ఆర్డర్ వేస్తోందట. అలాగే కథానుగుణంగా ఇంటిమేట్‌ సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి ఉన్న విషయాన్ని కూడా లేవనెత్తిందట.

    Also Read: బాపుబొమ్మకు వింత శబ్దాలు.. త్వరలోనే చెబుతుందట !

    ఇప్పుడున్న పరిస్థితుల్లో తానూ రొమాంటిక్‌ సన్నివేశాలకు కాస్త దూరంగా ఉండాలనుకుంటునట్లు చెప్పేసిందట. మొత్తానికి రష్మిక మాట‌ల‌ను బ‌ట్టి షూటింగ్‌ లంటే బాగానే భ‌య‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మరి ఆ కన్నడ సినిమాలో ప్రస్తుతం రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. ఇప్పుడు హీరోయిన్ ఇలా అనేసరికి ఆ నిర్మాత కాస్త నిరుత్సగానికి గురైయ్యాడట. అసలుకే కరోనా కష్టాల్లో నష్టపోయిన ఆ నిర్మాత ఈ యంగ్ బ్యూటీ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తోందని సదరు సినిమా డైరెక్టర్ కి మొరపెట్టుకుంటున్నాడట. తెలుగులో స్టార్ డమ్ వచ్చేసరికి కాస్త కన్నడ పరిశ్రమ పై రష్మిక చిన్న చూపు చూపిస్తోందని, ఆ డైరెక్టర్ కూడా పెదవి విరుస్తున్నాడట. మొత్తానికి రష్మిక పై వారు బాగా అసంతృప్తిగా ఉన్నారట.