https://oktelugu.com/

OTT Movies : ఈ వారం ఓటీటీలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్… ఏకంగా 18 సినిమాలు, వివరాలు ఇవే!

సూపర్ స్టార్స్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ లిస్ట్ లో ప్రభాస్ కల్కి, ధనుష్ రాయన్ వంటి క్రేజీ చిత్రాలు ఉన్నాయి. వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో విడుదలవుతున్న చిత్రాలు సిరీస్ల వివరాలు చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 20, 2024 / 06:35 PM IST

    ott realese

    Follow us on

    OTT Movies : ఈ వీకెండ్ లో క్రేజీ సినిమాలు, సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. సరికొత్త కంటెంట్ తో మూవీ లవర్స్ ని థ్రిల్ చేసేందుకు సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ కల్కి 2898 ఏడీ ‘ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27న ధియేటర్స్ లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ టాక్ తో వసూళ్ల మోత మోగించింది. వరల్డ్ వైడ్ కల్కి రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. కల్కి 2829 AD అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లో ఆగస్టు 22 నుండి అందుబాటులోకి రానుంది. దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ వంటి భారీ క్యాస్ట్ ఈ చిత్రంలో నటించారు.

    అలాగే తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేసి, నటించిన ‘ రాయన్ ‘, మరో డబ్బింగ్ మూవీ ‘ గర్ర్ ‘ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.కాగా థియేటర్లలో విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. నార్నె నితిన్ నటించిన చిన్న సినిమా ‘ ఆయ్ ‘ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. తమిళ మూవీ ‘ తంగలాన్ ‘ తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.

    ఇక వివిధ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులోకి వస్తున్న చిత్రాలు, సిరీస్లు ఏమిటో చూద్దాం…

    అమెజాన్ ప్రైమ్
    యాంగ్రీ యంగ్ మ్యాన్ ది సలీమ్ జావేద్ స్టోరీ – హిందీ సిరీస్ – ఆగస్టు 20
    కల్కి 2898 ఏడీ – తెలుగు సినిమా – ఆగస్టు 22
    ఫాలో కర్లో యార్ – హిందీ సిరీస్ – ఆగస్టు 23
    రాయన్ – తెలుగు డబ్బింగ్ మూవీ – ఆగస్టు 23

    నెట్ ఫ్లిక్స్
    టెర్రర్ ట్యూస్ డే ఎక్స్ట్రీమ్ – థాయ్ సిరీస్ – ఆగస్టు 20
    జీజీ ప్రీసింక్ట్ – కొరియన్ సిరీస్ – ఆగస్టు 22
    కల్కి 2898 ఏడీ – హిందీ వర్షన్ – ఆగస్టు 22
    మెర్మైడ్ మ్యూజిక్ – ఇంగ్లీష్ సిరీస్ – ఆగస్టు 22
    ప్రెట్టి గార్డియన్ సెయిలర్ మ్యాన్ కాస్మోస్ ది మూవీ పార్ట్ 1 – జపనీస్ సినిమా – ఆగస్టు 22
    ఇన్ కమింగ్ – ఇంగ్లీష్ మూవీ – ఆగస్టు 23
    ది ఫ్రాగ్ – కొరియన్ సిరీస్ – ఆగస్టు 23

    ఆహా
    ఉణర్వుగళ్ తొడరకథై – తమిళ సినిమా – ఆగస్టు 23

    హాట్ స్టార్
    గర్ర్ – తెలుగు డబ్బింగ్ సినిమా – ఆగస్టు 20
    ద సుప్రీంమ్స్ ఎట్ ఎర్ల్స్ ఆల్ యు కెన్ ఈట్ – ఇంగ్లీష్ మూవీ – ఆగస్టు 23

    మనోరమ
    స్వకార్యం సంభవబాహులం – మలయాళ మూవీ – ఆగస్టు 23

    ఆపిల్ ప్లస్ టీవీ
    పచింకో సీజన్ 2 – కొరియన్ సిరీస్ – ఆగస్టు 23

    లయన్స్ గేట్ ప్లే
    ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ – ఇంగ్లీష్ సినిమా – ఆగస్టు 23

    జియో సినిమా
    డ్రైవ్ ఏవే డాల్స్ – ఇంగ్లీష్ మూవీ – ఆగస్టు 23