https://oktelugu.com/

అరెస్ట్ వారెంట్ పై బాలయ్య సీరియస్ !

నందమూరి ‌బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ అనగానే భారీ యాక్షన్ సీన్స్, డబుల్ గెటప్స్, అరుపులు కేకల హడావుడి అనేది సర్వసాధారణం. పైగా ఈ కలయిక పై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ క్రేజ్ ఉంది. ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వడంతో ఇప్పుడు వస్తోన్న మూడో సినిమాకి క్రేజ్ మరింత పెరిగింది. ఐతే, ఈ సినిమాకి ముందు నుండి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. అనేక అవాంతరాలను దాటుకుని ఎలాగోలా సగం సినిమా […]

Written By:
  • admin
  • , Updated On : March 14, 2021 / 02:20 PM IST
    Follow us on


    నందమూరి ‌బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ అనగానే భారీ యాక్షన్ సీన్స్, డబుల్ గెటప్స్, అరుపులు కేకల హడావుడి అనేది సర్వసాధారణం. పైగా ఈ కలయిక పై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ క్రేజ్ ఉంది. ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వడంతో ఇప్పుడు వస్తోన్న మూడో సినిమాకి క్రేజ్ మరింత పెరిగింది. ఐతే, ఈ సినిమాకి ముందు నుండి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. అనేక అవాంతరాలను దాటుకుని ఎలాగోలా సగం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కానీ, ఇప్పటికే ఈ సినిమా విషయంలో అందరూ సఫర్ అవుతున్నారట.

    Also Read: ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు.. పొలిటికల్‌ ఎంట్రీపై తారక్‌

    తమలో తమకున్న గోడవులు చాలవు అన్నట్టు.. కొత్తగా ఈ సినిమా నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నాన్‌ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ అందుకోవాల్సి రావడంతో.. ఈ వ్యవహారం బాలయ్యకి చికాకు పెట్టించిందట. ఇంతకీ ర‌వీంద‌ర్‌రెడ్డి పై అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ లోని ప్ర‌త్తిపాడు కోర్టు. ఎందుకంటే.. కొన్నాళ్ల క్రితం రవీందర్ రెడ్డి నాగ చైతన్య హీరోగా ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’ అనే సినిమా తీసి బాగా దెబ్బ తిన్నాడు.

    Also Read: అమ్మాయిని అది అడిగిన హైప‌ర్ ఆదీ.. ఇంత దారుణ‌మా? అని అంద‌రూ షాక్!

    కాగా ఆ సినిమా రిలీజ్ సమయంలో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్ర‌త్తిపాడుకి చెందిన వ్యక్తి దగ్గర 50 ల‌క్ష‌లు తీసుకున్నాడట. అయితే తీసుకున్న 50 ల‌క్ష‌లు తిరిగి చెల్లించ‌ట్లేదని ఆ వ్యక్తి కేసు పెట్టాడు. ఆ కేసులో భాగంగానే ఇంతకుముందు కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఐతే, కోర్టు ఆదేశాల్ని మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఖాతరు చెయ్యకుండా.. బాలయ్య బాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దాంతో ఈసారి నాన్ ‌బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    బాలయ్య నిర్మాత పై నాన్ ‌బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ అనగానే బాలయ్యకి అది అవమానం అట. అందుకే బాలయ్య సీరియస్ అవుతున్నాడు. పైగా తన సినిమా విడుదలకు ముందు ఇలాంటి సమస్యలు ఉంటే.. తీరా విడుదల రోజు సినిమాకి క్లియరెన్స్ ప్రాబ్లమ్ వస్తుందని.. అప్పుడు సినిమా ఆగిపోతుంది అని, అందుకే ఎట్టిపరిస్థిత్తుల్లో కేసుకు సంబంధించిన అన్నీ క్లియర్ చేసుకోవాలని బాలయ్య, నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డికి ఆర్డర్స్ పాస్ చేసాడట.