అమరావతిలోనూ వైసీపీనే.. రాజధానులకు చంద్రబాబు జైకొట్టాల్సిందేనా?

ఏపీలోని మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ జోరు కొనసాగుతోంది. 71 మున్సిపాలిటీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ఊపు తగ్గలేదని మరోసారి రుజువు అయ్యింది. వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. అమరావతిని కాదని.. మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటించడం.. కసరత్తు చేస్తుండడంతో అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ కార్పొరేషన్లలో టీడీపీ గెలుస్తుందని అంతా అనుకున్నారు. ప్రజలు మూడు రాజధానులకు […]

Written By: NARESH, Updated On : March 17, 2021 12:57 pm
Follow us on

chandrababu

ఏపీలోని మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ జోరు కొనసాగుతోంది. 71 మున్సిపాలిటీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ఊపు తగ్గలేదని మరోసారి రుజువు అయ్యింది. వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి.

అమరావతిని కాదని.. మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటించడం.. కసరత్తు చేస్తుండడంతో అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ కార్పొరేషన్లలో టీడీపీ గెలుస్తుందని అంతా అనుకున్నారు. ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని చాటిచెప్పాలని చంద్రబాబు బాగానే ప్రచారం చేశారు. కానీ ఈ రెండింటినీ వైసీపీ గెలుచుకొని అమరావతి సెంటిమెంట్ లేదని టీడీపీకి షాక్ ఇచ్చేసింది. దీన్ని బట్టి మూడు రాజధానులకు అమరావతి ప్రజలు జై కొట్టినట్టే.. చంద్రబాబు వాదన ఫెయిల్ అయినట్టేనని తెలుస్తోంది.

అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా 450 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడి రైతులు చంద్రబాబుకు ఈ ఫలితాలు గట్టి షాకిచ్చాయనే చెప్పొచ్చు. చంద్రబాబు సైతం ప్రజాతీర్పును అంగీకరించి మూడు రాజధానులకు జై కొట్టాలన్న డిమాండ్ కు మరింత ఊతం ఇచ్చినట్టు ఫలితాలు నిరూపించాయి. ఈ పరిణామం వైసీపీలో జోష్ నింపినట్టైంది.

గుంటూరులో వైసీపీ గెలిస్తే అమరావతిని ఎక్కడికైనా మార్చుకోవచ్చంటూ చంద్రబాబు చేసిన ప్రకటనను ఇప్పుడు వైసీపీ లేవనెత్తుతోంది. చంద్రబాబు నిరసనలకు స్వస్తి చెప్పి 3 రాజధానులకు ఓకే చెప్పాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.