https://oktelugu.com/

రోబో స్టోరీ వివాదంలో శంకర్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్

ఇండియాలో మేటి దర్శకుల్లో ఒకరైన ‘శంక‌ర్‌’ తీసిన ‘ఎంథిరన్’‌ సినిమా స్టోరీ కాపీ వివాదంలో కోర్టు ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటం చర్చనీయాంశం అవుతుంది. 2010 సంవత్సరంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషలలో ‘రోబో’ గా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా స్టోరీ విషయంలో అప్పట్లో తాను రాసిన ‘జిగుబా’ కథను కాపీ చేసి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 1, 2021 / 02:38 PM IST
    Follow us on


    ఇండియాలో మేటి దర్శకుల్లో ఒకరైన ‘శంక‌ర్‌’ తీసిన ‘ఎంథిరన్’‌ సినిమా స్టోరీ కాపీ వివాదంలో కోర్టు ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటం చర్చనీయాంశం అవుతుంది. 2010 సంవత్సరంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషలలో ‘రోబో’ గా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా స్టోరీ విషయంలో అప్పట్లో తాను రాసిన ‘జిగుబా’ కథను కాపీ చేసి ‘ఎంథిరన్’‌గా తీశారంటూ శంక‌ర్‌పై అరూర్ తమిళ నందన్‌ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేసి కోర్టుకెక్కటం జరిగింది.

    Also Read: స్టార్ హీరో నుండి “A” ట్రైలర్ !

    రైటర్ అరుర్‌ తమిళ్‌నందన్‌ రాసిన ‘జిగుబా’ కథ 1996లో ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురించారు. అనంతరం ఆ స్టోరీని 2007లో ‘ధిక్‌ ధిక్‌ దీపిక దీపిక’ నవలగా ముద్రించటం కూడా జరిగింది. అదే కథని కాపీ కొట్టి ఎంథిరన్ మూవీని శంకర్ తీసాడంటూ, స్టోరీ విషయంలో తనకు న్యాయం జరగాలంటూ అరుర్ పెట్టిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ డైరెక్టర్ కి కోర్టు అనేక పర్యాయాలు ఆదేశాలు జారీచేసింది. గత పదేళ్లుగా ఈ కేసు విషయంలో శంకర్ కోర్టుని సైతం లెక్కచేయకుండా లైట్ తీసుకున్నాడు.

    Also Read: రజనీకాంత్ కోసం ఇరవై కిలోలు తగ్గిందట !

    ఈ క్రమంలో శంకర్ తీరుపై ఆగ్రహించిన ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ కోర్టు అతడికి నాన్ ‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసి తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. ప్రస్తుతం కమల్ హాసన్ తో తీస్తున్న ‘ఇండియన్ 2’ మూవీ విషయంలో తలెత్తిన అనేక వివాదాలు ఈ మధ్యనే సమసిపోగా శంకర్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఊహించని విధంగా వచ్చిన కోర్టు వారెంట్ కి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన స్పందించి తీరాల్సిందే… చూద్దాం ఏం జరుగుతుందో ?

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్.