Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ బాగా హీటెక్కింది. రతిక మాత్రం ఓ రేంజ్ లో విజృంభిస్తుంది. ప్రియాంక కి మళ్ళీ చుక్కలు చూపించింది రతిక. అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వాయించేసింది. తనని నామినేట్ చేసిన రతికని తిరిగి నామినేట్ చేసింది ప్రియాంక. నువ్వు వేస్తున్న నామినేషన్స్ కి నీకు పాయింట్స్ దొరకడం లేదు అంటూ ..ప్రియాంక చెప్పింది. ఉన్నదాన్ని తవ్వి తవ్వి నామినేట్ చేసింది నువ్వు.. అని రతిక అనడంతో నా అభిప్రాయం కరెక్ట్ గా వెళ్లకపోయుంటే దాని గురించి రచ్చ అయ్యేది మొన్న అని ప్రియాంక చెప్పింది.
కరెక్ట్ గానే వెళ్లిందని నీకు ఎలా తెలుసమ్మా.. నువ్వే ఎమన్నా బయటకెళ్ళి చూసొచ్చావా .. అంటూ రతిక వెటకారం చేసింది. నువ్వు బయటకెళ్ళి చూసినా ఏం చేయలేదులే అంటూ కౌంటర్ ఏసింది ప్రియాంక. ఇద్దరు వాదించుకుంటుండగా రతిక ప్రియాంక పైకి వెళ్లి మాట్లాడింది. ఇంతలో శివాజీ కల్పించుకుని ‘ మరీ ఎదురుగా వద్దు .. ఇలా పక్కకి రా అని రతికతో చెప్పాడు.
నామినేషన్స్ జరిగేటప్పుడు మధ్యలో ఎవరూ మాట్లాకండి అని రతిక అనడంతో ..మాట్లాడడం అమ్మా.. కొంచెం దూరం అమ్మ అని శివాజీ అన్నాడు. నా నామినేషన్ అన్నా అంటూ రతిక శివాజీని కూడా లెక్క చేయలేదు. ఆ తర్వాత నాగార్జున సార్ తో నువ్వు చెప్పాల్సింది ఈ పాయింట్ అంటూ ప్రియాంక మాట్లాడింది.
దీంతో రతిక రెచ్చిపోయి .. ప్రతి సారి మళ్ళీ మళ్ళీ నాగ సార్ హోస్ట్ మాత్రమే .. హౌస్ మెట్ కాదు .. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను మాట్లాడతా.. రచ్చ అయ్యేది .. రంభోలా అయ్యేది కాదు ఇక్కడ అంటూ రతిక ఓ రేంజ్ లో ఇచ్చిపడేసింది. దాంతో ప్రియాంక సైలెంట్ అయిపోయింది. ఇక ప్రియాంక తన రెండో నామినేషన్ అశ్విని కి వేసింది. ఈ నామినేషన్స్ సీన్ లో మాత్రం రతిక బాగా హైలైట్ అయింది. అలాగే అర్జున్-పల్లవి ప్రశాంత్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శివాజీ చెప్పినట్లు కాకుండా ఇకనైనా నీ గేమ్ ఆడు అన్న పాయింట్ మీద అర్జున్ ప్రశాంత్ ని నామినేట్ చేశాడు.
ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అంటే..
రతిక- ప్రియాంక, శోభా శెట్టి
అర్జున్- శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్
ప్రియాంక- రతిక, అశ్విని
గౌతమ్- అర్జున్, అమర్ దీప్ లను నామినేట్ చేశారు. ఇంకా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. శివాజీ కెప్టెన్ కాగా అతన్ని ఎవరూ నామినేట్ చేయరాదు. నేటి ఎపిసోడ్ తో ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుస్తుంది.