Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్ శోభా శెట్టి ఇటీవల హౌస్లో తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో ఆమెకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిరు బిగ్ బాస్. అయితే కొన్ని రోజులుగా హౌస్ లోకి ఫ్యామిలీ వీక్ లో భాగంగా కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. ఇక పండుగ స్పెషల్ ఎపిసోడ్ లో ఫ్రెండ్స్ ,ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చి కంటెస్టెంట్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. కాగా శోభా శెట్టి మూడేళ్లుగా దాచి పెడుతూ వస్తున్న సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో బిగ్ బాస్ టీం రివీల్ చేశారు. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
అంతకుముందు నాగార్జున శోభాని బాయ్ ఫ్రెండ్ గురించి అడగ్గానే .. అతని పేరు యశ్వంత్ రెడ్డి అని చెప్పింది. తనని ముద్దుగా పాపు అని పిలుచుకుంటానని .. మూడున్నర ఏళ్లుగా వాళ్ళు రిలేషన్ లో ఉన్నారని చెప్పుకొచ్చింది. ఇక తర్వాత నాగార్జున ఆమె తండ్రిని, యశ్వంత్ ని స్టేజి పైకి ఆహ్వానించారు. బాయ్ ఫ్రెండ్ ని చూసిన శోభా సంతోషంలో తేలిపోయింది.ప్రియుడితో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది శోభా శెట్టి.
ఇంతకీ యశ్వంత్ … కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడు గా చేసిన ఆదిత్యనే శోభా ప్రియుడు. అయితే కార్తీక దీపం ముగిసిన తర్వాత కూడా యశ్వంత్ తో శోభా శెట్టి ఫ్రెండ్ షిప్ చేసింది. తర్వాత అది ప్రేమగా మారింది. ఆ తర్వాత శోభా -యశ్వంత్ కలిసి ఒక సినిమాలో నటించారు. బుజ్జి బంగారం అనే సినిమాలో హీరో హీరోయిన్లు గా చేశారు.
కానీ వీరిద్దరి ప్రేమ విషయం ఎక్కడా బయటపెట్టలేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లో అప్పుడపుడు తేజ తో ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకునేది కానీ పేరు మాత్రం రివీల్ చేయలేదు. ఇక సండే రోజు జరిగిన దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో శోభా ద్వారానే నిజం చెప్పించారు నాగార్జున.ఇక అతడిని స్టేజి పైకి పిలిచి శోభకు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.