Odi World Cup 2023: వరల్డ్ కప్ 2023 తుది దశకు చేరుకుంది. ఆల్రెడీ సెమీఫైనల్ కి అడుగు పెట్టింది. ఇక మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ గా ఇండియా న్యూజిలాండ్ టీమ్ లా మధ్య ఒక భారీ మ్యాచ్ అనేది జరగబోతుంది.ఇక ఇప్పటికే ఈ మ్యాచ్ కి సంబంధించిన సర్వం సిద్ధమైనప్పటికీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ మాత్రం ప్రపంచ దేశాలన్నింటిలో నెలకొంది. ఇప్పటికే చాలా దేశాల మాజీ ప్లేయర్లు సైతం ఇండియా టీం ఓడిపోవాలని కోరుకుంటు ఇండియా కి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు… ఎందుకంటే వాళ్లందరి టీమ్ లను డామినేట్ చేస్తూ ఇండియా వరుసగా తొమ్మిది మ్యాచ్ లు గెలవడం వల్ల దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు… అందుకే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇండియా మాత్రం వాళ్ళకి తమ గెలుపుతో సమాధానం చెప్తుంది…
ఇక ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్ ల కోసం అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక అందులో భాగంగానే సెమీఫైనల్ మ్యాచ్ లకు ఐసిసి అంపైర్ లను నియమించింది. ఇక అందులో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ అయిన ఇండియా న్యూజిలాండ్ టీమ్ లా మధ్య జరిగే మ్యాచ్ కి ఆన్ ఫీల్డ్ అంపైర్‌లుగా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ టక్కర్ లను నియమించారు.ఇక అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ విధులు నిర్వర్తించనున్నారు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ నియమించబడ్డాడు. అయితే వీళ్ళందరూ కూడా మంచి అనుభవం ఉన్న అంపైర్లు కావడం వల్ల ఐసిసి వీళ్లని నియమించడం జరిగింది…ఇక ఈ మ్యాచ్ తో రాడ్ టక్కర్ అంపైర్‌గా తన వందో అంతర్జాతీయ మ్యాచ్ కి ఎంపైరింగ్ చేయబోతున్నారు…
ఇక ఇది ఇలా ఉంటే మరో అంపైర్ అయిన రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ 2019 వన్డే వరల్డ్ కప్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్లో కూడా ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాడు…ఆ మ్యాచ్‌లో ఇండియన్ టీమ్ చివరి వరకు పోరాటం చేసి చివరికి న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది…
ఇక రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ గా జరగనున్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ లో రిచర్డ్ కెటిల్‌బరో, నితిన్ మీనన్ ఫీల్డ్ అంపైర్‌లుగా సెలెక్ట్ అయ్యారు. ఇక అలాగే థర్డ్ అంపైర్‌గా క్రిస్ గఫానీ, ఫోర్త్ అంపైర్‌గా మైఖేల్ గోఫ్ అంపైర్ లుగా ఈ మ్యాచ్ కి వాళ్ల సేవలను అందించనున్నారు. ఇక అదేవిధంగా మ్యాచ్ రిఫరీగా ఇండియన్ మాజీ ప్లేయర్ అయిన జావగల్ శ్రీనాథ్ వ్యవహరించనున్నారు…
ఇక ఈ రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ ల్లో కూడా అంపైర్ నిర్ణయాలు కీలకంగా మారానున్నాయి. ఎంత డిఆర్ఎస్ ఉన్నప్పటికి కూడా ప్రతిసారి దాని మీద డిపెండ్ అవ్వలేము కాబట్టి ఫీల్డ్ అంపైర్ నిర్ణయాలు కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఇది ఇలా ఉంటే 2019 ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కి అంపైర్ గా చేసిన రిచర్డ్ వెల్లింగ్ వర్త్ ని ఇప్పుడు కూడా రిపీట్ చేయడం వెనక కారణం ఏంటంటే అంతకు ముందు చేసిన అంపైర్స్ కంటే కూడా ఆ టైం లో ఆయన మంచి అంపైరింగ్ చేశాడనే ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా అదే రీతిలో అంపైరింగ్ చేస్తాడనే నమ్మకం తో ఇప్పుడు కూడా ఆయననే రిపీట్ చేసినట్టు గా తెలుస్తుంది…