Megastar Chiranjeevi: అందర్నీ కలుపుకుపోవాలనుకునే తన మనస్తత్వమే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికు పెద్ద శాపం అయిపోయింది. అదేంటో చిరు పేరు వింటేనే.. ఓ ప్రభంజనం అన్నట్టు ఊగిపోయే అభిమానులు కొన్ని విషయాల్లో మాత్రం చిరుకు సరైన సమయంలో మద్దతు ఇవ్వడంలో ఎప్పుడు విఫలం అవుతూనే ఉన్నారు. చిరంజీవి ప్రస్తుతం సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.

నిజంగానే పెద్ద దిక్కు అనే గౌరవం కూడా చిరుకు కొన్నాళ్ళ పాటు దక్కింది. వెతుక్కుంటూ వచ్చిన గౌరవం కాబట్టి.. చిరు కూడా ఆ గౌరవాన్ని కాదు అనలేక చక్కగా కరోనా నేపథ్యంలో ముందుండి, సినీ పరిశ్రమను నడిపాడు. సినీ ప్రముఖులతో చేతులు కలిపి చందాలు వసూలు చేసి .. సినీ పరిశ్రమలోని కార్మికుల్ని ఆదుకునేందుకు ఓ ట్రస్ట్ పెట్టి నిత్యవసర సరుకులు అందజేసి మంచి పని చేశారు.
అయితే, డబ్బు అందరిదీ పేరు మాత్రం చిరంజీవిదే అన్నట్టు అయింది ఆ వ్యవహారం. దాంతో చిరు(Megastar Chiranjeevi) పై అప్పట్లో కొందరి చాటున బాగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. దాంతో పరిశ్రమలో అందరికీ అందుబాటులో ఉండటానికి ఆ మధ్య బాగా ప్రయత్నం చేసిన చిరు, ఆ కామెంట్స్ కి బాధ పడి.. ఇక ఈ పెద్దరికం గట్రా మనకు వద్దు అనుకుని సైలెంట్ గా వరుస సినిమాలను సెట్ చేసుకుంటూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
Also Read: సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్కు చిరు విజ్ఞప్తి
కాకపోతే అపుడప్పుడు చిన్న సినిమాల్ని ప్రమోట్ చేసేందుకు తనవంతు సాయాన్ని అందిస్తుంటాడు చిరు. ఈ క్రమంలోనే పరిశ్రమ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యతను కూడా చిరు తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో చిరంజీవి ఎప్పుడూ చొరవ చూపుతూనే వస్తున్నారు. అయితే ఆ చొరవ ఇప్పుడు ఎవరికీ నచ్చడం లేదు.
ప్రభుత్వాలను డిమాండ్ చేయడంలో చిరంజీవి ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ చివరకు డిమాండ్ చేయలేక, రిక్వెస్ట్ చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకే నచ్చడం లేదు. ఇక చిరంజీవి అనవసరంగా జగన్ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తున్నారని ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్ అవుతున్నారు. మొత్తానికి అటు వాళ్లకు ఇటు వీళ్లకు నచ్చడం లేదు చిరు. పాపం.